Lok Sabha: సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను 15 మంది విపక్ష ఎంపీలను మిగిలిన సెషన్‌కు సస్పెండ్ చేస్తూ లోక్‌సభ ఈరోజు తీర్మానం చేసింది. సస్పెండ్ అయిన 15 మందిలో తొమ్మిదిమంది ఎంపీలు కాంగ్రెస్‌కు చెందిన వారు. వీరిని సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం చేశారు.
సస్పెండయిన ఎంపీలు..(Lok Sabha)
మాణికం ఠాగూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకాంతం, బేణి బహన్, కే సుబ్రమణ్యం, ఎస్ఆర్ ప్రతిబన్, ఎస్ వెంకటేషన్, మహ్మద్ జావేద్ సస్పెండ్ అయిన పార్లమెంట్ సభ్యుల్లో ఉన్నారు.సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది మంది, సీపీఎంకు చెందిన ఇద్దరు, డీఎంకేకు చెందిన ఇద్దరు, సీపీఐకి చెందిన ఒకరు ఉన్నారు.తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూసుకెళ్లడంతో బుధవారం నాటి భద్రతా లోపంపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.