Site icon Prime9

J&K Terror Attack: జమ్ము కశ్మీర్ లో యాత్రికుల బస్సుపై టెర్రిరిస్టుల కాల్పులు.. 10 మంది మృతి

J&K Terror Attack

J&K Terror Attack

J&K Terror Attack:జమ్ము కశ్మీర్‌లో లష్కర్‌ ఏ తోయిబా టెర్రరిస్టులు మరోమారు రెచ్చిపోయారు. ప్రధానంగా హిందూ భక్తులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా శివ్‌ ఖోరీ నుంచి వైష్ణోదేవీకి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఎల్‌ఏటి టెర్రరిస్టులు టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ దాడిలో గాయపడిన వారు సోమవారం నాడు తమ అనుభవాలను మీడియతో పంచుకున్నారు. తాము ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయినా… టెర్రరిస్టులు మాత్రం విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది భక్తులు మృతి చెందగా 33 మంది గాయపడ్డారు. టెర్రరిస్టుల నుంచి తప్పించుకునేందుకు తామంతా చనిపోయినట్లు నటించాల్సి వచ్చిందని వారు వివరించారు.

లోయలో పడిన బస్సు..(J&K Terror Attack)

టెర్రరిస్టులు నలు దిక్కుల నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తుండటంతో.. బస్సు డ్రైవర్‌కు బుల్లెట్‌ తగింది. బస్సు కంట్రోల్‌ తప్పి నేరుగా లోయలో పడిపోయింది. గాయాలతో బయటపడిన వ్యక్తి .. టెర్రరిస్టుల దాడికి సంబంధించి వివరాలు అందించారు. తాను వైష్ణో దేవీని దర్శించుకున్న తర్వాత నేరుగా శివ్‌ఖోరి చేరుకున్నాం.. శివ్‌ఖోరి నుంచి నాలుగు -ఐదు కిలోమీటర్ల ముందుకు వచ్చామో లేదో తమ బస్సుపై టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. డ్రైవర్‌పై నేరుగా గురి పెట్టి కాల్చారు. దీంతో డ్రైవర్‌ పట్టుతప్పి నేరుగా బస్సు లోయలోపడింది. దాడిలో పలువురికి గాయాలయ్యాయి.

మరో ప్రత్యక్ష సాక్షి సంఘటన గురించి వివరించారు.శివ్‌ఖోరి దర్శనం చేసుకుని వెనుదిరిగిన వెంటనే టెర్రరిస్టులు కాల్పులు జరపడంత బస్సులో లోయలో పడింది. తన అంచనా ప్రకారం ఇద్దరు నుంచి ముగ్గురు టెర్రరిస్టులు పాల్గొన్నారని చెప్పాడు. త కుమారుడు టెర్రరిస్టులు తమ బస్సు వెనుక నుంచి కాల్చడం చూశాడని చెప్పారు. ఇక అధికారుల విషయానికి వస్తే టెర్రరిసట్లు బస్సులో ఉన్న ప్రతి ప్రయాణికుడిని చంపాలని ప్లాన్‌ చేశారని చెప్పారు. బస్సులో లోయలోపడ్డా కూడా కాల్పులు జరిపారంటే వారి ఉద్దేశం ఏమిటో తెలిసిపోతోందన్నారు. రెయాసీ టెర్రర్‌ దాడిలో ఈ ప్రాంతం అంతా షాక్‌కు గురైంది. జమ్ము కశ్మీర్‌కు టెర్రర్‌దాడులతో ముప్పు పొంచి ఉంది. అయితే అధికారులు మాత్రం ఈ టెర్రర్‌దాడుల్లో పాల్గొన్న వారిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 

 

 

Exit mobile version