Ram Gopal Varma comments: వైఎస్ వివేకా హత్య కేసుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ షర్మిల చేసినవి అపరిపక్వ వ్యాఖ్యలని ఆర్జీవీ అన్నారు. సునీత పేరుతో ఆస్తులున్నాయి కాబట్టి హత్యకి ఆమె ఎలా సహకరిస్తారని షర్మిల ప్రశ్నించడం సరికాదని ఆర్జీవీ తప్పుబట్టారు. సునీత పేరిట వివేకా ఆస్తులు రాసి ఉండొచ్చని కానీ ఆయన బతికే ఉన్నారు కాబట్టి వీలునామా మార్చడానికి అవకాశాలున్నాయని ఆర్జీవీ అంచనా వేశారు.
ఆస్తి రెండో భార్య పేరిట రాస్తారని.. (Ram Gopal Varma comments)
ఆయనకి రెండో భార్యతో ఉన్న సంబంధం బయటపడి గొడవలు జరిగి ఉండొచ్చని ఆర్జీవీ చెప్పారు. లేదా ఆస్తి రెండో భార్య పేరిట రాస్తారని అనుమానించి ఉండొచ్చని ఆర్జీవీ తెలిపారు. ఆయన మళ్ళీ వీలునామా మారుస్తారని అనుమానించి ఉండొచ్చని లేదా సమాచారం అంది ఉండొచ్చని ఆర్జీవీ చెబుతున్నారు. ఏదో ఒక కారణంతో ఏదో ఒకటి చేయడానికి ప్రేరణ అయితే ఉందని, అది నిజంగా ఇలాగే జరిగిందా లేదా అన్నది కూడా తెలియదని ఆర్జీవి తెలిపారు. ఇదంతా తేల్చాల్సింది దర్యాప్తు సంస్థేనని ఆర్జీవి అన్నారు.
దీనికి సంబంధించి ఒక కారణం సునీత వైపు ఉందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యుడు దీపక్ భరద్వాజ్ హత్య కూడా అలాంటిదేనని గుర్తు చేశారు. ఆస్తి విషయంలో సొంత కుమారుడే హత్య చేశాడన్నారు. దీనికి సంబంధించిన కథనంతో కూడిన ఆంగ్ల వెబ్‌సైట్ లింక్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.