Site icon Prime9

Lottery: ఆ గ్రామంలో అందరూ ఒక్కరాత్రిలోనే కోటీశ్వరులయిపోయారు..!

Lottery

Lottery

Lottery: ఒక గ్రామంలో నివసించే 165 మంది ప్రజలను ఒక్కరాత్రిలోనే అదృష్టం వరించింది. అందరూ కలిసి లక్షాధికారులు అయ్యారు. అలా ఇలా కాదు ఏకంగా 1200 కోట్ల రూపాయలకు పైగా లాటరీని గెలుచుకున్నారు. ఇలా ఒక్కొక్కరి ఖాతాలో దాదాపు 7 కోట్ల 50 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంత భారీ మొత్తాన్ని గెలుచుకున్న తర్వాత బెల్జియంలోని ఆంట్‌వెర్ప్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ ఓల్మెన్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

డైలీ మెయిల్ ప్రకారం, ఒల్మెన్ గ్రామానికి చెందిన 165 మంది కలిసి యూరో మిలియన్ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఇందుకోసం ఒక్కొక్కరు రూ.1,308 ఇచ్చారు. లాటరీ టిక్కెట్ ని కొనేముందు కూడా ప్రైజ్ మనీని అందరికీ సమానంగా పంచాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. మంగళవారం లక్కీ డ్రాను ప్రకటించారు, అందులో లాటరీ నంబర్ కు 123 మిలియన్ పౌండ్లు బహుమతిగా వచ్చాయి. ఇది భారత కరెన్సీలో ఈ మొత్తం 1200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ.ఈ మొత్తాన్ని 165 మందికి పంచితే ఒక్కొక్కరి ఖాతాలో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు వస్తాయి. కొందరు దీనిని ‘ఉత్తమ క్రిస్మస్ బహుమతి’గా అభివర్ణించారు.

జాతీయ లాటరీ ప్రతినిధి జాక్ వెర్మోర్ మాట్లాడుతూ గ్రూప్‌లో ఈ విధంగా బహుమతి గెలవడం కొత్త విషయం కాదు. అయితే, 165 మంది వ్యక్తులతో కూడిన ఈ బృందం ఇప్పటివరకు అతిపెద్ద లాటరీ విజేతగా నిలిచిందని అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో లాటరీని గెలవడాన్ని ప్రజలు నమ్మలేకపోతున్నారని ఆయన అన్నారు.

Exit mobile version