Site icon Prime9

Chhattisgarh: ఇదేం ఆచారం రా దేవుడా.. కట్నం కింద వరుడికి 21 పాములు..!

21 snakes giving as dowry in those tradition in chhattishgarah

21 snakes giving as dowry in those tradition in chhattishgarah

Chhattisgarh: పెళ్లి అనగానే సాధారణంగా కట్నం ఎంత అని అడుగుతుంటారు. వధువు కుటుంబ సభ్యులు వరుడికి కట్నకానుకలు సమర్పించడం అనాది కాలంగా వస్తోన్న ఆచారం. నిజానికి వరకట్నం నిషేధం. కానీ ఎవరి స్థాయికి తగినట్టుగా వారు వరుడికి వివిధ వస్తువులు, నగదు, బంగారం రూపేణా కట్నాలు సమర్పించుకుంటారు. పూర్వకాలంలో ఈ కట్నకానుకల కింద చాలా మంది పశువులు, వ్యవసాయ భూమి ఇచ్చేవాళ్లు. కానీ ప్రస్తుతం ట్రెండ్ తగినట్టుగా మధ్యతరగతి వాళ్లు కట్నకానుకల కింద కొత్త బైకు, నగదు ఇస్తుంటే.. ధనవంతులు మాత్రం ఖరీదైన కార్లు, భవంతులు, విలువైన ఆభరణాలు ఇస్తున్నారు. అయితే ఒక ప్రాంతంలో వింత ఆచారం కొనసాగుతుంది వరుడికి కట్నం కింద వారు పాములు ఇస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. ఈ ఆచారాన్ని వాళ్లు ఎప్పటి నుంచో పాటిస్తూ వస్తున్నారంట.

ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా జిల్లాలో సొహగ్‌పూర్‌ అనేది చిన్న మారుమూల గ్రామంలో ఈ వింత ఆచారం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా సవ్రా సామాజికవర్గం ప్రజలు నివసిస్తారు. వీరి పెళ్లిళ్లలో వధువు కుటుంబ సభ్యులు వరుడికి పాములను కట్నంగా ఇస్తుంటారు. అలా ఇవ్వకుంటే ఇక్కడ పెళ్లిళ్లు జరుగవట. గతంలో కట్నం కింద వరుడికి 21పాములను ఇచ్చేవారని.. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 11 తగ్గిందట. దీనికి కారణం ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని కఠినంగా అమలుచెయ్యడం వల్ల ఈ సామాజిక వర్గం ప్రజలకు పాములు పట్టడం కష్టంగా మారిందని అక్కడి ప్రజలు చెప్తున్నారు.

అయితే కట్నంగా పాములే ఎందుకు సమర్పిస్తారంటే సవ్రా సామాజిక వర్గానికి చెందిన ప్రజల ప్రధాన జీవనాధారం పాములేనట. వారు పాములతో విన్యాసాలు చేస్తూ భిక్షాటన చేయడం ద్వారా వచ్చే డబ్బులతో తమ కుటుంబాలను పోషిస్తారట. అందువల్లే ఆ సామాజిక వర్గానికి చెందిన ఆడపిల్ల కుటుంబ సభ్యులు పెళ్లిలో వరుడికి కట్నం కింద పాములను ఇవ్వడం ఆనవాయితీగా మారిందట. కానీ ఈ ప్రజలకు సరైన వసతులు అందక, రేషన్ కార్డులు వచ్చినప్పటికీ ప్రభుత్వ పథకాలు మాత్రం లభించకపోవడం వల్ల ఇప్పటికీ పాములను నమ్ముకునే.. ఆ తెగ ప్రజలు భిక్షాటన చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారట.

ఇదీ చదవండి ఈ రియల్ మోగ్లీని చూశారా.. ఈ విద్యార్థి కాలేజీకి ఎలా వెళ్తున్నాడో చూడండి..!

Exit mobile version