Site icon Prime9

AP Captial Fight: రాజధానిపై పోరాటం ఆపేదిలేదు

There is no stopping the fight

There is no stopping the fight

Guntur: ఈ నెల 12నుండి ప్రారంభమైన అమరావతి టు అరసువల్లి మహాపాదయాత్ర గుంటూరు జిల్లా పెదరాపూరు నుండి నేడు బయలుదేరింది. పాదయాత్రలో స్థానికులు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. తొలుత పెదరాపూరులో పూజలు చేశారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. దారిపొడువునా ఎక్కడిక్కడ ప్రజల ఘన స్వాగతాలతో యాత్ర ముందుకు సాగుతుంది.

ఈ సందర్భంగా మహాపాద యాత్రలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ కోర్టు తీర్పుకు విరుద్ధంగా 3 రాజధానుల నిర్ణయానికే  కట్టుబడివున్నామంటూ అసెంబ్లీలో చట్టం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సరికాదన్నారు. న్యాయస్ధానాల తీర్పును అపహస్యం చేయడమేనని తప్పుబట్టారు. పాదయాత్రను అడ్డుకొనేందుకు ఎన్ని అవాంతరాలు కల్పించినా తమ పోరాటం ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు.

Exit mobile version