Site icon Prime9

MLA went to vote with a cylinder: సైకిల్ కి సిలిండర్ కట్టుకుని.. ఓటు వేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే

cylinder

cylinder

Gujarat: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటివిడత పోలింగ్ ప్రారంభమైంది . నేడు 89 నియోజకవర్గాల ప్రజలు 788 అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఓటు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు చేరుకుంటున్నారు. అయితే తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని సైకిల్‌పై గ్యాస్ సిలిండర్ కట్టి పోలింగ్ బూత్ కు బయలుదేరి అందరి దృష్టిని ఆకర్షించారు.

వీడియో క్లిప్‌లో, పరేష్ ధనాని గ్యాస్ సిలిండర్‌ను సైకిల్ కు కట్టి నడుపుతూ కనిపించాడు ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయని రాసిన కాగితాన్ని అతికించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పలు సార్లు గ్యాస్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రజలకు అర్దమయ్యేలా చెప్పాలని ఎమ్మెల్యే ధనాని భావించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version