Site icon Prime9

Amaravati: అమరావతి ఆర్ 5 జోన్‎లో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Amaravati

Amaravati

Amaravati: అమరావతిలోని ఆర్ 5 జోన్‎లో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ 5 జోన్‎లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వోచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ హైకోర్టు తుది తీర్పుకు కట్టుబడే ఉండాలన్న అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.

ఆర్ 5 జోన్ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై ఈరోజు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. రైతుల తరఫున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, శ్యాందివాన్ వాదించారు. ఆర్ 5 జోన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అమరావతి రైతులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

ప్లాట్ల పంపిణీకి తొలగిన అడ్డంకులు..(Amaravati)

ప్రభుత్వ పట్టాల పంపిణీలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో అమరావతిలోని ఆర్‌5 జోన్‌లో సెంటు ప్లాట్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సీఆర్‌డీఏ చట్టాన్ని ఉల్లంఘించి ఆర్‌5 జోన్‌ ఏర్పాటు చేస్తున్నారని అమరావతి రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దర్యాప్తు సందర్భంగా పేదలకు పట్టాలు పంపిణీ చేశామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. దీనిపై వాదనల అనంతరం.. ఇళ్ల స్థలాల పంపిణీలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ భూ యాజమాన్య హక్కులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

మాస్టర్ ప్లాన్ ప్రకారం విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పెట్టుబడులతో వస్తున్న ఐటీ కంపెనీలకు కేటాయించిన ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ చట్టాన్ని కూడా ప్రభుత్వం సవరించింది. తుళ్లూరు మండలంలోని మంధం, ఐనవోలు, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల సరిహద్దుల్లోని 1,134 ఎకరాలను ఆవాస ప్రాంతంగా, ఆర్‌-5 జోన్‌గా ప్రకటిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది.ఈ గెజిట్‌ను సవాల్‌ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు

Exit mobile version
Skip to toolbar