Site icon Prime9

Jupadubanglow Police: పోలీసుల పరిధి పంచాయతీ.. రెండురోజులుగా నీట్లోనే డెడ్ బాడీ

police

police

Kurnool: నేరాలు, ప్రమాదాలు జరిగిన వెంటనే రంగంలోకి దిగవలసిన పోలీసులు సంఘటనా స్దలంతమ పరిధిలోకి రాదంటూ తప్పించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి ఘటనే ఒకటి కర్నూలుజిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు కు చెందిన 19 ఏళ్ళ యువకుడు కనిపించకుండా పోయాడు. ఆవేదనతో వారు అంతా వెతికి.. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఉండగా కృష్ణా జిల్లాలో పోతిరెడ్డి పాడు వద్ద ఓ మృతదేహం తేలుతోంది. మీ వాడేనేమో చూడండి అని కొంతమంది చెప్పారు. కన్నవారు, కుటుంబ సభ్యులు ఆందోళనతో అక్కడికి చేరుకున్నారు.

తీరా చూస్తే మృతదేహం బోర్లా పడి.. నీటిలో తేలుతూ ఉంది. ఇంట్లో అయితే కొడుకును భుజం పట్టుకుని తిప్పి చూసేవారేమో. కానీ ఇంట్లో కాదు.. ఏట్లో ఉన్నాడు. అది కూడా శవమై తేలాడు. పోలీసులు తప్ప మిగతా వారు ఎవరు ముట్టడానికి వీలులేని పరిస్థితి.అప్పటికే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సమీపంలోని పాములపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి చూశారు. ఇది తమ పరిధిలోకి రాదన్నారు.

జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి వెళ్లిపోయారు. జూపాడు బంగ్లా పోలీసులు వచ్చి చూసి ఇది తమ పరిధి లోకి రాదని పాములపాడు పరిధిలోకే వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ శవాన్ని మాత్రం ఎవరూ వెలికి తీయలేదు. ఇలా ఒకరిపై ఒకరు చెబుతూ మృతదేహాన్ని అలా వదిలేసి వెళ్ళడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ పంతులు చేసుకుంటున్నారు. దీంతో కన్నవారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది.

Exit mobile version