Site icon Prime9

Nora Fatehi : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై పరువు నష్టం దావా వేసిన నోరా ఫతేహి… ఎన్ని వందల కోట్లు అంటే !

Nora Fatehi

Nora Fatehi

Nora Fatehi : సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో తన పేరును అన్యాయంగా చేర్చారంటూ నటి నోరా ఫతేహి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై రూ. 200 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఫతేహి వివరణ ప్రకారం ఆమెకు చంద్రశేఖర్‌తో వ్యక్తిగత లావాదేవీలు లేవు. అతని భార్య లీనా మరియా పాల్ ద్వారా మాత్రమే అతనితో పరిచయం ఉంది. చంద్రశేఖర్ నుండి బహుమతులు స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలను ఆమె తిరస్కరించింది.మీడియా తీర్పు తన పేరును నాశనం చేస్తుందని పేర్కొంది.

నోరా చెప్పినదాని ప్రకారం తామిద్దరం ఒకే పరిశ్రమలో పనిచేస్తున్నాము సమానమైన నేపథ్యాలు కలిగి ఉన్నందున, తన స్వంత ప్రయోజనాల కోసం తన కెరీర్‌ను నాశనం చేయడానికి, పరువు తీయడానికి జాక్వెలిన్ ప్రయత్నించినట్లు నోరా పేర్కొంది. తనకు ఎలాంటి సంబంధంలేకపోయినా ఇందులో తనపేరును లాగారని వాపోయింది.ఈ ఇద్దరు నటీమణులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణను ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సెప్టెంబరులో, నటి నోరా ఫతేహీ బృందం రూ. 200 కోట్ల కుంభకోణం కేసులో ఆమెకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు పేర్కొంది. సుకేష్ ప్లాన్ చేస్తున్న క్రైమ్ సిండికేట్ గురించి ఆమెకు తెలియదని కూడా ప్రస్తావించబడింది.

Exit mobile version