Site icon Prime9

Yuvagalam: చంద్రబాబు దేవుడు.. నేను జగన్‌కి మొగుడు – నారా లోకేష్

lokesh padayatra

lokesh padayatra

 Yuvagalam: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో పాదయాత్రను ఈ రోజు ప్రారంభించారు.

ఇందులో భాగంగా.. కుప్పంలో తొలి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ పై లోకేశ్ (Nara Lokesh Yuvagalam) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సైకిల్ సంక్షేమ పాలన అందిస్తే.. జగన్ సైకో పాలనతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని ఆరోపించారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాదయాత్ర ముందుకు సాగుతుందని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

వైసీపీ కి చక్రవడ్డీతో సహా చెల్లిస్తా(Nara Lokesh Yuvagalam )

తెలుగు దేశం అధినేత చంద్రబాబు దేవుడని.. తాను మాత్రం వైఎస్సార్సీపీ పాలిట రాక్షసుడ్ని అవుతానని హెచ్చరించారు.

వైసీపీ వాళ్లు చేసిందానికి వడ్డీతో సహా, చక్రవడ్డీతో సహా చెల్లిస్తానని స్పష్టం చేశారు. కుప్పంలో అక్రమ మైనింగ్ చేశారని.. అక్రమ మైనింగ్ లో మింగేసిన ప్రతి రూపాయినీ కక్కిస్తానని లోకేష వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వచ్చిన తర్వాతే కుప్పం గురించి అందరికీ తెలిసిందన్నారు. చంద్రబాబు ఏడో సారి గెలుచారు కాబట్టే ఈరోజు కుర్రకుంకలను నోరు లేస్తోందన్నారు.

చంద్రబాబు కుప్పంలో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్ లు, డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చారన్నారు. ఇక్కడ ఏ రోడ్డు తీసుకున్నా చంద్రబాబు పేరు గుర్తుకువస్తుందన్నారు.

నియోజక వర్గంలో చెక్ డ్యాములు కట్టారని, పరిశ్రమలు తీసుకువచ్చి 20 వేల మందికి ఉపాధి కల్పించారన్నారు.

పేద ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ. 2 లకే ఎన్టీఆర్ సుజల పథకం తీసుకు వచ్చారని గుర్తుచేశారు.

 

జగన్ రెడ్డి అమూల్ పాలు తాగే సమయంలోనే

జగన్ రెడ్డి అమూల్ పాలు తాగే సమయంలోనే చంద్రబాబు ఇజ్రాయెల్ టెక్నాలజీతో కుప్పంతో డ్రిప్ ఇరిగేషన్ తీసుకువచ్చారన్నారు.

చంద్రబాబు హయాంలో రూ. 613 కోట్లతో హంద్రీనీవా పనులు 90 శాతం పూర్తిచేస్తే.. ఈ మూడన్నరేళ్లలో మిగిలిన 10 శాతం పూర్తిచేయలేకపోయారని ఆరోపించారు.

పేదల కోసం హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఈ సైకో ఆ ప్రాజెక్టును నిలిపివేశాడని ధ్వజమెత్తారు. సైకో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుప్పానికి ఆర్టీసీ బస్సులు తగ్గించారన్నారు.

అలాంటి వాళ్లు కుప్పంలో గెలుస్తారా అని నారా లోకేష్ (Nara Lokesh Yuvagalam) ప్రశ్నించారు.

వైసీపీ పాలనకు భయపడే ప్రసక్తే లేదని లోకేష్ అన్నారు.

వైసీపీ పాలనే అంతంగా తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

వారాహిని అడ్డునేకు ధైర్యం ఎవరికి లేదని లోకేష్ అన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version