Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ కషాయాలు తాగితే రోగాలు దూరం..

వర్షాకాలంలో గాలి, నీరు కలుషితమై ఇన్ ఫెక్షన్లు సులభంగా వ్యాపిస్తాయి. ఈ సీజ‌న్‌లో టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూ, సైనస్‌, డయేరియా, చికున్ గున్యా వంటి జ‌బ్బులు అధికంగా వేధిస్తుంటాయి. అందుకే వ‌ర్షాకాలంలో ఆరోగ్యాన్ని ఎంతో జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌ని నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తుంటారు. వ‌ర్షాకాలంలో ఇబ్బంది పెట్టే జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ

  • Written By:
  • Updated On - July 15, 2022 / 05:53 PM IST

Monsoon Health Tips: వర్షాకాలంలో గాలి, నీరు కలుషితమై ఇన్ ఫెక్షన్లు సులభంగా వ్యాపిస్తాయి. ఈ సీజ‌న్‌లో టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూ, సైనస్‌, డయేరియా, చికున్ గున్యా వంటి జ‌బ్బులు అధికంగా వేధిస్తుంటాయి. అందుకే వ‌ర్షాకాలంలో ఆరోగ్యాన్ని ఎంతో జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌ని నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తుంటారు. వ‌ర్షాకాలంలో ఇబ్బంది పెట్టే జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతో కొన్ని కొన్ని క‌షాయాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

వాము కషాయం..
వ‌ర్షాకాలంలో ఖ‌చ్చితంగా తాగాల్సిన క‌షాయాల్లో వాము క‌షాయం ఒక‌టి. ముందుగా ఒక గ్లాస్ వాట‌ర్‌లో ఒక స్పూన్ వాము, చిటికెడు న‌ల్ల ఉప్పు వేసి బాగా మ‌రిగించి వ‌డ‌బోసుకోవాలి.ఆ త‌ర్వాత నిమ్మ ర‌సం క‌లిపి సేవించాలి. ఈ క‌షాయం తీసుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది. దాంతో సీజ‌న‌ల్ వ్యాధిలు ద‌రి చేర‌కుండా ఉంటాయి. అంతేకాదు, వాము క‌షాయం తాగ‌డం వ‌ల్ల కీళ్ళ నొప్పులు త‌గ్గుతాయి.

తులసి ఆకుల కషాయం..
అలాగే తుల‌సి ఆకుల క‌షాయం కూడా వ‌ర్షాకాలంలో తీసుకుంటే చాలా మంచిది. గ్లాస్ వాట‌ర్‌లో గుప్పెన తుల‌సి ఆకులు, చిటికెడు ప‌సుపు వేసి బాగా మ‌రిగించి ఫిల్ట‌ర్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఇందులో తేనె క‌లుపుకుని తాగాలి. ఈ క‌షాయం తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, గొంతు నొప్పి, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ద‌గ్గుతాయి. మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. మ‌రియు వైరల్ ఇన్ఫెక్షన్స్, జ్వరం వంటి రోగాలకు దూరంగా ఉండొచ్చు.

శొంఠి కషాయం..
ఇక వ‌ర్షాకాలంలో త‌ప్ప‌కుండా తాగాల్సిన క‌షాయాల్లో శొంఠి క‌షాయం కూడా ఉంది. ముందు గ్లాస్ వాట‌ర్‌లో అర స్పూన్ శొంఠి పొడి వేసి బాగా మ‌రిగించుకోవాలి. అనంత‌రం నీటిని వ‌డ‌బోసుకుని ఒక స్పూన్ తేనె క‌లిపి సేవించాలి. ఈ శొంఠి క‌షాయం తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలను త‌గ్గుముఖం ప‌డ‌తాయి. సీజ‌న‌ల్‌ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.