Bandi Sanjay comments: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. చేతగాని బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం పార్టీ చేతిలో ఉందని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్‌ని గెలిపించాలని ఎంఐఎం పార్టీ చూస్తోందని, ఆ పార్టీకి దమ్ముంటే తెలంగాణలోని మొత్తం స్థానాల్లో పోటీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదులని పెంచిపోషించే పార్టీ ఎంఐఎం అన్న బండి సంజయ్ హోంమంత్రి అమిత్ షా హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నారని ఏ ఉగ్రవాది చెప్పాడో అని వ్యంగ్యంగా అన్నారు.
ఉగ్రవాదులను పెంచి పోషించే పార్టీ.. (Bandi Sanjay comments)
ఓల్డ్ సిటికి ఎంఐఎం పార్టీ ఏం చెసింది? ఓల్డ్ సిటి ఎందుకు అభివృద్ధి చెందడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం కొమ్ముకాస్తుంది.
ఎంఐఎం పార్టీ కి చెతకాకనే బిఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తుంది.ఎంఐఎం పార్టీ హైదరాబాదు దాటి ఎందుకు పోటి చెస్తలేదని బండి సంజయ్ అడిగారు. ఉగ్రవాదులని పెంచి పోషించే పార్టీ ఎంఐఎం అని ఆయన ఆరోపించారు. ఎంఐఎం పార్టీ తెలంగాణ లో అధికారంలోకి రావాలని కోరుకుంటోందా? ముస్లిం సమాజం కోసం కొట్లాడే పార్టీ అయితే తెలంగాణ అంతటా పోటి చెయ్యాలంటూ బండి సంజయ్ సవాల్ చేసారు.