Glass shells in chicken curry: హాస్టల్ చికిన్ కూరలో గాజు పెంకులు

ఓ చికెన్ కర్రీ హాస్టల్ విద్యార్ధులను దీక్షకు దిగేలా చేసింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కంటిమీద కునుకులేకుండా చేసిన ఆ ఘటన ఉస్మానియా వర్సిటీలో చోటుచేసుకొనింది

Hyderabad News: సమాచారం మేరకు తమకు వడ్డించిన చికెన్ కర్రీలో గాజు పెంకులు ఉన్నాయంటూ ఉస్మానియా వర్షిటీ విద్యార్ధినులు ఆందోళనలకు దిగారు. కొద్దిగా కూర తిన్న అనంతరం గాజు పెంకులు విషయం బయటపడడంతో విధ్యార్ధినులు ఖంగుతున్నారు. ఒకింత భయాందోళనలతో వణికిపోయారు. హాస్టల్ లో భోజనంతోపాటుగా, తాగునీటి సదుపాయాలు అద్వానంగా ఉన్నాయంటూ  విద్యార్ధినులు ప్రాంగణంలో బైఠాయించారు. పౌష్టికరమైన ఆహారాన్ని మహిళలు తినాలంటున్నారని, ఇదేనా పౌష్టికర ఆహారమంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

విషయం కాస్తా వెలుగులోకి రావడంతో బిజెపి నేత, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యార్ధినుల ఆవేదనల వీడియోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. విద్యాశాఖ మంత్రి స్పందించాలంటూ మంత్రి సబితకు ప్రశ్నలు సంధించారు. ఏవమ్మా…ఇవన్నీ కూడా సిల్లీ రీజన్లే అవుతాయనంటూ ఆమె మాటలు ఆమెకే కోమటిరెడ్డి అప్పచెప్పారు. సిఎం కెసిఆర్ మనముడు తినే భోజనాన్నే విద్యార్ధినులకు పెడుతన్నారా? అంటూ సబితను  ప్రశ్నించారు. తన ట్వీట్ ను సబితతో పాటుగా తెలంగాణ సిఎంవోలకు ఆయన ట్యాగ్ చేశారు.