Site icon Prime9

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

Kavitha

Kavitha

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను ఢిల్లీ లోని రౌస్‌ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. మరో ఆరు రోజులపాటు అంటే మే 20 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఆమె కస్టడీ మంగళవారంతో ముగియడంతో రౌస్‌ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. 14 రోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, చార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు తెలిపింది.కానీ కోర్ట్ మాత్రం 6 రోజుల వరకు రిమాండ్ ను పొడిగించింది.

8 వేల పేజీలతో చార్జిషీటు..(Delhi Liquor Case)

మంగళవారం ఈడీ 8 వేల పేజీలతో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది .దీనిని పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 20న విచారిస్తామని కోర్ట్ తెలిపింది. ఈ క్రమంలోనే కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్‌ కోర్టు జడ్జి వెల్లడించారు. అదే విధంగా ఇటీవల సీబీఐ కేసులోనూ కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.మరోవైపు ఈడీ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.

 

Exit mobile version