Site icon Prime9

Azharuddin: అజారుద్దీన్ పై రాచకొండ కమీషనర్ కు ఫిర్యాదు

Azharuddin 

Azharuddin 

#HCA: హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై రాచ‌కొండ పోలీసు క‌మిష‌నరేట్ లో మ‌రో ఫిర్యాదు న‌మోదు అయింది.  సీఏ మాజీ ప్రెసిడెంట్ జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, మెంబర్ చిట్టి శ్రీధర్ బాబులు క‌లిసి సోమ‌వారం రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేష్ భ‌గ‌వ‌త్ కు త‌మ ఫిర్యాదును అందించారు.

గత సెప్టెంబర్ 26వ తేదీతోనే హెచ్ సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ప‌దవీ కాలం ముగిసింద‌ని ఆ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. అయితే త‌ప్పుడు ధృవ‌ప‌త్రాల‌ను సృష్టించి బీసీసీఐ, ఎన్నిక‌ల క‌మిష‌న్ క‌మిటినీ తప్పుదోవ పట్టించే విధంగా అజరుద్దీన్ వ్యవహరించారని అందులో తెలిపారు. పదవీకాలం పెంచుకునే విష‌యంలో అజారుద్దీన్ ఎవ‌రినీ సంప్ర‌దించ‌లేద‌ని, ఆయ‌నే సొంతంగా గ‌డువును పొడిగించుకున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నెల 18వ తేదీన బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని, అందులో పాల్గొనేందుకు వీలుగా అజారుద్దీన్ తన పదవి కాలాన్ని పొడ‌గించుకున్నార‌ని పేర్కొన్నారు.ఈ విష‌యంలో క్రిమినల్ కేసు కింద‌, ఐపీసీ ప్రకారం చ‌ట్ట ప్ర‌కారం తగిన చర్యలు తీసుకోవాల‌ని హైద‌రాబాద్ క్రికెట్ అసోషియేష‌న్ మాజీ ప్రతినిధులు రాచకొండ సీపీ మహేష్ భగవత్ ని కోరారు.

Exit mobile version