Chandrababu Naidu Assistance: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమగోదారి జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం తరపున దెబ్బతిన్న పంటలను చూసేందుకు ఎవరూ రాలేదని రైతులు ఆవేదనతో ఆయనకు చెప్పుకున్నారు.
ఈ సందర్బంగా పలు కౌలు రైతులు తాము ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించినా ఏమీ మిగలటం లేదని చంద్రబాబుకు చెప్పారు. ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లేసరికి చాలా ఖర్చు అవుతోందన్నారు. పంటల తడిసి ముద్దయినా ప్రజాప్రతినిధలు ఎవరూ వచ్చి చూడలేదని వాపోయారు. తమ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభత్వం పై వత్తిడి తేవాలని కోరారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలో వైసీపీ కార్యకర్తైన మహిళా రైతుకు చంద్రబాబు వరాలు కురిపించారు. తడిసిన ధాన్యం అధికారులు కొనకపోవడంతో పిల్లల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నామని జువ్వలపల్లి పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పిల్లల చదువులకు అయ్యే ఖర్చు తానే ఇస్తానని చంద్రబాబు చెప్పారు. అక్కడికక్కడే 2 లక్షల 30 వేలు పద్మావతికిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదిలా ఉండగా.. ధాన్యం తడిసి ముద్దయితే కనీసం సీఎం, ఎమ్మెల్యే కూడా రాలేదని వైసీపీ కార్యకర్త, మహిళా రైతు పద్మావతి మండిపడ్డారు.
https://youtu.be/j_7IkA19otk