Site icon Prime9

Babu Mohan: బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్ బూతుపురాణం.. ఆడియో వైరల్

babu mohan

babu mohan

Babu Mohan: రాష్ట్రంలో భాజపా నేత ఆడియో వైరల్ గా మారింది. ఓ కార్యకర్తతో మాజీ మంత్రి.. భాజపా నేత బాబు మోహన్ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. ఇందులో సదరు కార్యకర్తను బాబూ మోహన్ బూతులతో తిట్టారు. ప్రస్తుతం ఈ ఆడియో హాట్ టాపిక్ గా మారింది.

ఆడియోలో ఏముంది..

బాబు మోహన్ తో కలిసి పనిచేస్తానని.. ఓ కార్యకర్త ఫోన్ చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు మోహన్.. నువ్వెంత? నీ బతుకెంత? అంటూ సదరు కార్యకర్తను బూతులు తిట్టారు.

తానో ప్రపంచస్థాయి నాయకుడినని బెదిరించారు. ఇంకోసారి తనకు ఫోన్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించారు.

చివరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని సైతం విడిచిపెట్టలేదు. బండి సంజయ్ ఎవరు అంటూ సమాధానం ఇచ్చారు.

అవసరం అయితే.. భాజపా కు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వ్యక్తి ఎందుకు కాల్ చేశారు..

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆందోల్‌కి చెందిన బీజేపీ కార్యకర్త వెంకటరమణ బాబుమోహన్‌కి కాల్ చేశారు.

మెుదటగా.. చెప్పు తమ్ముడు అంటూ ఇద్దరి మధ్య సంభాషణ సజావుగానే జరిదింది.

ఎదుటి వ్యక్తి.. మీతో కలిసి పని చేయాలని అందుకోసమే ఫోన్ చేశానని ఆ కార్యకర్త వివరించారు.

దీంతో బాబు మోహన్ బూతు పురాణం అందుకున్నాడు. నాతో కలిసి పని చేయడానికి.. నువ్వెంత.. నీ బతుకెంత అంటూ బాబు మోహన్
మాటలు వదిలిపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాజపాను బలోపేతం చేసేందుకే.. తనను అమిత్ షా బీజేపీలో చేర్చుకున్నారని తెలిపారు.

తాను ఒక ప్రపంచస్థాయి నాయకుడినని.. ఆ కార్యకర్తపై మాటల దాడికి దిగారు. ఇదే క్రమంలో బండి సంజయ్ పై సైతం ఆరోపణలు చేశారు.

బండి సంజయ్ ఎవడ్రా, వాడు నా తమ్ముడు అని బదులిచ్చారు. ఇంకోసారి తనకు ఫోన్ చేస్తే.. చెప్పు తీసుకొని కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.

అదే వేడిలో బీజేపీకి రాజీనామా చేస్తానన్నారు.

ఓ కార్యకర్తకు ఇచ్చే మర్యాద ఇదేనా?.. పార్టీ కోసం తాను ఎంతో కాలంగా బీజేపీలో ఉన్నానని ఎదుటి వ్యక్తి అన్నారు.

పార్టీ కోసం కష్టపడుతున్నానని.. మర్యాద ఇచ్చే పద్దతి ఇదేనా అని చెబుతున్న బాబు మోహన్ వినిపించుకోకుండా ఫోన్ పెట్టేయ్ అంటూ అరిచారు.

నువ్వు నాతో మాట్లాడ్డానికి అనర్హుడివి, ఆ కార్యకర్తను చిన్న చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డింగ్ వైరల్ అవుతోంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version