AP 10th Results 2023 : ఏపీలోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) ఫలితాలను విడుదల చేసింది.
పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది.
ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం(87.4 శాతం ఉత్తీర్ణత).
నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది(60 శాతం).
ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
జూన్ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు.
మే 17వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తులకు ఆహ్వానం.