Shiv Sena:శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నేత సంజయ్ రౌత్ శివసేన పార్టీ పేరు మరియు దాని ‘విల్లు మరియు బాణం’ గుర్తును “కొనుగోలు” చేయడానికి రూ.2000 కోట్ల ఒప్పందం” జరిగిందని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారపార్టీకి దగ్గరగా ఉన్న ఒక బిల్డర్ తనకు ఈ విషయాన్ని తెలిపారని అన్నారు.త్వరలోనే చాలా విషయాలు వెల్లడి కానున్నాయి. దేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని రౌత్ అన్నారు.
ఏకనాథ్ షిండే వర్గమే నిజమైన శివసేన..(Shiv Sena)
శివసేన పార్టీ గుర్తు పై ఉధ్దవ్ ఠాక్రే. ఏక్ నాధ్ షిండే వర్గాలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. దీనితో శుక్రవారం ఎన్నికల సంఘం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి దానికి ‘విల్లు మరియు బాణం’ ఎన్నికల గుర్తును కేటాయించాలని ఆదేశించింది.రాష్ట్రంలో అసెంబ్లీ ఉపఎన్నికలు పూర్తయ్యే వరకు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయించిన “ఫ్లేమింగ్ టార్చ్” పోల్ గుర్తును ఉంచుకోవడానికి అనుమతించింది. ఎన్నికలసంఘం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్దవ్ ఠాక్రే దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ఎక్కువ ఓట్టు..(Shiv Sena)
2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 55 మంది శివసేన అభ్యర్థులకు అనుకూలంగా పోలైన ఓట్లలో ఏక్‌నాథ్ షిండేకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు దాదాపు 76 శాతం ఓట్లు పొందారని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గెలిచిన శివసేన అభ్యర్థులకు అనుకూలంగా పోలైన ఓట్లలో 23.5 శాతం వచ్చాయని ముగ్గురు సభ్యుల కమిషన్ ఏకగ్రీవంగా ఉత్తర్వులు జారీ చేసింది.
శివసేన రాజ్యాంగం అప్రజాస్వామ్యికం..
శివసేన ప్రస్తుత రాజ్యాంగం అప్రజాస్వామికమని ఈసీ పేర్కొంది. 2018లో సవరించిన సేన రాజ్యాంగం పోల్ ప్యానెల్ రికార్డులో లేదని పేర్కొంది.2018లో సవరించిన శివసేన రాజ్యాంగం ఎన్నికలసంఘానికి ఇవ్వబడలేదు. కమిషన్ ఒత్తిడితో దివంగత బాలాసాహెబ్ థాకరే తీసుకువచ్చిన 1999 పార్టీ రాజ్యాంగంలో ప్రజాస్వామ్య నిబంధనలను ప్రవేశపెట్టే చర్యను సవరణలు రద్దు చేశాయని ఎన్నికల సంఘం తెలిపింది.1999లో ఎన్నికలసంఘం ఆమోదించని శివసేన రాజ్యాంగం యొక్క అప్రజాస్వామిక నిబంధనలను ఒక రహస్య పద్ధతిలో తిరిగి తీసుకురావడం ద్వారా పార్టీని మరింత ద్వేషపూరితంగా మార్చిందని ఎన్నికల సంఘం గమనించింది.
ఇవి కూడా చదవండి:
- Israeli missile strike: సిరియాలోని డమాస్కస్‌లో నివాస భవనంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. 15 మంది మృతి..
- Road Accident In Bapatla District : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఐదుగురు మృతి!
- Nandamuri Taraka Ratna : హైదరాబాద్ కి నందమూరి తారక రత్న భౌతిక కాయం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?