Site icon Prime9

Love Marriage :70 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడిన 19 ఏళ్ల యువతి

Love

Love

Love Marriage: మాప్రేమకు ఖచ్చితంగా పరిమితులు లేవు అందుకే వయస్సు అడ్డంకిని పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నామని అంటున్నారు పాకిస్తాన్ కు చెందిన ఒక జంట. పాకిస్తాన్ లో 19 ఏళ్ల యువతి 70 ఏళ్ల వ్యక్తిని పెళ్లిచేసుకుంది. లియాఖత్ అలీ, (70)మరియు షుమైలా అలీ, (19) ప్రేమ కథను పాకిస్థానీ యూట్యూబర్ సయ్యద్ బాసిత్ అలీ పంచుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. దాదాపు 50 ఏళ్లు పైబడిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న షుమైలా, సాధారణ మార్నింగ్ వాక్‌లో తన భర్తను కలుసుకుంది.

లాహోర్‌కు చెందిన ఈ జంట రోజువారీ మార్నింగ్ వాక్ లో ఒకరినొకరు కలుసుకున్నారు. షుమైలాను ఇష్టపడిన లియాఖత్ ఆమె వెనుక జాగింగ్ చేస్తూ పాటలు పాడారు. చివరకు వారిరువురు వివాహం చేసుకున్నారు. దీనిపై షమైలా మాట్లాడుతూ ప్రేమకు ఖచ్చితంగా సరిహద్దులు లేవని మరియు ఖచ్చితంగా వయస్సు తమకు ఒకటి కాదని పేర్కొంది. ఆమె ప్రేమలో వయస్సును చూడరని పేర్కొంది.నా తల్లిదండ్రులు కొంతకాలం అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ మేము వారిని ఒప్పించగలిగామని ఆమె తెలిపింది

లియాఖత్ ఆలీ మాట్లాడుతూ వివాహం చేసుకోవడానికి చట్టబద్ధంగా రొమాన్స్ విషయానికి వస్తే వయస్సు ఒక అంశం కాదు. ఎవరైనా ముసలివాడో, చిన్నవాడో అనే ప్రశ్నే లేదు. చట్టబద్ధంగా వివాహం చేసుకోవడానికి అనుమతి ఉన్న ఎవరైనా వివాహం చేసుకోవచ్చని చెప్పాడు.ఈ జంట చాలా ప్రేమగా సంతోషంగా ఉన్నారు. లియాఖత్ తన భార్య వంటలను ఎంతగానో ఇష్టపడతానని చెప్పాడు. పెళ్లి అయినప్పటి నుండి రెస్టారెంట్లలో తినడం మానేసినట్లు పేర్కొన్నాడు.

Exit mobile version