YS Sunitha Comments: ఏపీ సీఎం జగన్ పై అయన సోదరి ,వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు .జగన్ తలపై బ్యాండేజి తీ సివేస్తేనే మంచిదని సలహా ఇచ్చారు .గాలి ఆడకుండా ఎక్కువ కాలం ఉంటే గాయం మానదని అన్నారు .అలాగే ఉంచుకుంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని ఒక డాక్టర్ గా చెబుతున్నానని అన్నారు .పులివెందుల లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.
.నామినేషన్ సందర్భంగా జగన్ తన పై చేసిన వ్యాఖ్యలకు కూడా ఈ సందర్భంగా సునీత స్పందించారు .పులివెందులలో నామినేషన్ వేసే సందర్భం లో జగన్ తన తండ్రి వివేకానందరెడ్డి పై చేసిన వ్యాక్యలను తప్పుపట్టారు .ఏమి పాపం చేసాడని తన తండ్రి పై అంత ద్వేషం,ని కోసం సీట్ త్యాగం చేసినందుకు కోపమా అంటూ ప్రశ్నించారు .జగన్ మాటల్లో తన తండ్రి పై ద్వేషమే కనబడుతుందని అన్నారు .సీఎం జగన్ కు న్యాయ వ్యవస్థ ,సీబీఐ పై నమ్మకం లేదని ,అలాంటప్పుడు ఏ వ్యవస్థ పై నమ్మకం ఉందో చెప్పాలని అన్నారు .తన తండ్రి వివేకానంద రెడ్డి హత్యపై మాట్లాడ వద్దని కోర్ట్ కు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు .సీబీఐ నిందితులుగా పేర్కొన్న వాళ్లకు ఓట్లు వేయవద్దని ఈ సందర్భంగా సునీత కోరారు .ఒక వేల తాము తప్పుచేసినా శిక్ష పడాల్సిందే నని అన్నారు .తాను కానీ తన భర్త కానీ తప్పుచేసినట్లు రుజువు అయితే శిక్షకు సిద్దమే అన్నారు .జగన్ అవినాష్ రెడ్డి ని పిల్లోడు అని అంటున్నాడు ..ఎంపీ పదవి పిల్లలకు ఇస్తారా అంటూ ప్రశ్నించారు సునీత .సీబీఐ నిందితులుగా పేర్కొన్న వాళ్లకు జగన్ సహాయం చేస్తున్నారు .వాళ్లనే ప్రోత్సహిస్తున్నారని ఆమె విమర్శించారు. ఐదేళ్లుగా నా తండ్రి హత్య పై పోరాడుతుంటే నాకు రాజకీయాలు అంటగడుతున్నారు .ఇప్పటికైనా సీఎం జగన్ నా పోరాటానికి సహాయం చేయాలని అంటూ సునీత ఆవేదన వ్యక్తం చేసారు.