YS Sharmila Letter: సీఎం జగన్ కు మరో లేఖ రాసిన వైఎస్ షర్మిల

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ కు నవసందేహాలు పేరుతో మరో లేఖ రాసారు. ఈ లేఖలో రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాను అడుగుతున్న సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.షర్మిల రాసిన లేఖలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 12:59 PM IST

YS Sharmila Letter: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ కు నవసందేహాలు పేరుతో మరో లేఖ రాసారు. ఈ లేఖలో రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాను అడుగుతున్న సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.షర్మిల రాసిన లేఖలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

నవసందేహాలు..

1) ప్రభుత్వంలో వచ్చాక 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు..ఏమయింది ?

2) జనవరి 1 న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు..ఎందుకు ఇవ్వలేదు ?

3) 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అన్నారు..22 ఎంపీలు ఇస్తే ఏం చేశారు ?

4) గ్రూప్ 2 నోటిఫికేషన్ రెండు సార్లు ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు..ఎందుకు ?

5) విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎందుకు భర్తీ చేయలేదు ?

6) 23 వేలతో మెగా డీఎస్సీ అని చెప్పి 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు ?

7) రాష్ట్రంలో నిరుద్యోగులు 7.7శాతం పెరిగారు అంటే అది మీ వైఫల్యం కాదా ?

8) ఉద్యోగాలు లేక బిడ్డలు ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు ?

9) జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్నారు…ఇప్పుడు జాబు రావాలి అంటే మీ పాలన పోవాలి అంటే అంగీకరిస్తారా ? అంటూ షర్మిల తన లేఖలో ప్రశ్నించారు. బుధవారం రాసిన లేఖలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న ‘నవ సందేహాలు’కు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంవత్సరాల తరబడి అందుతున్న పధకాలను ఎందుకు నిలిపివేసారని ఆమె ప్రశ్నించారు.