Site icon Prime9

YS Sharmila: వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు.

YS Sharmila

YS Sharmila

 YS Sharmila: వైఎస్ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబంలో జరగబోయే వేడుక గురించి ట్వీట్ చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, అట్లూరి ప్రియతో ఈ నెల 18న వివాహ నిశ్చితార్థం జరుగనుందని షర్మిల ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న పెళ్ళి జరుగనుందని షర్మిల తెలిపారు. రేపు అంటే రెండవ తేదీన ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రికని ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటామని షర్మిల వివరించారు.

వైఎస్ఆర్  ఘూట్ కు వెళ్లి..(YS Sharmila)

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు YS రాజారెడ్డికి,ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక , ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి,నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషంగా ఉంది అంటూ షర్మిల సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో ట్వీట్ చేసారు.

షర్మిల కొడుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ | YS Sharmila Son Marriage | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar