Varra Ravindra Reddy:ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతంలో విపక్ష మహిళా నేతలే టార్గెట్‌గా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల, సునీతారెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనితలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంతో పాటు పలువురిపై అసభ్యకరమైన కామెంట్స్ చేసాడు.
హైదరాబాద్ లో కేసు నమోదు..(Varra Ravindra Reddy)
తనపై, వైఎస్ షర్మిలపై అనుచిత పోస్టులు పెట్టారంటూ వైఎస్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత ఫిర్యాదుతో రవీంద్రపై ఫిబ్రవరిలో సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వరుస ఆరోపణల నేపథ్యంలో వైఎస్ భారతి పీఏ రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.రవీంద్రారెడ్డి కడప నుంచి కదిరి వెళ్లే మార్గ మధ్యలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.