Viveka Murder Case : మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయ్.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలుగు రాష్ట్రాలలో ఎంతటి సంచలనంగా మరిందో అందరికీ తెలిసిందే. కాగా 2019 మార్చి 15న ఆయన ఇంట్లోని బాత్రూమ్‌లోనే వైఎస్ వివేకానంద రెడ్డిని దుండగులు దారుణంగా నరికి చంపారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. వివేకా హత్య కేసు నాటి నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు తిరిగింది. కోర్టు, కేసులు, దోషులు, సాక్షులు, సీబీఐ విచారణ, ఇతర రాష్ట్రాలకు కేసు బదలాయించడం ఇలా ఈ కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. వైఎస్ వివేకానందారెడ్డి కుమార్తె వైఎస్ సునీత అభ్యర్థన మేరకు కేసును సీబీఐకు హైకోర్టు అప్పగించింది. అప్పటి నుంచి కేసు దర్యాప్తులో పలువురు నిందితులను అరెస్ట్ చేశారు.
సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కడప కేంద్రంగా ఈరోజు పలువురిని విచారించేందుకు సిద్దమయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. శనివారం విచారణకు రావాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ గతంలో నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే తాను 23వ తేదీన విచారణకు హాజరుకాలేనని భాస్కర్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారం అందజేశారు. ఈ క్రమంలోనే నేడు విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు జారీచేసింది.
(Viveka Murder Case) రెండుసార్లు విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి..
ఇక, ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండుసార్లు విచారించారు. గత నెల 28న మొదటిసారి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించగా.. తాజాగా శుక్రవారం(ఫిబ్రవరి 24) మరోసారి ఆయనను అధికారులు ప్రశ్నించారు. శుక్రవారం అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించారు. సీబీఐ విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను సీబీఐకి సహకరించానని చెప్పారు. సీబీఐ అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసినంతవరకు సమాధానం చెప్పానని తెలిపారు. జాగ్రత్తగా వార్తలు ప్రసారం చేయాలని మీడియాను కోరారు. తాను విజయమ్మను కలిస్తే బెదిరించి వచ్చానని కొందరు డిబేట్లు పెట్టి ప్రచారం చేశారని మండిపడ్డారు.
తాను దుబాయ్‌కి పారిపోయానని ఒక వర్గం దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. అటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు. వాస్తవాలు లక్ష్యంగా కాకుండా వ్యక్తి లక్ష్యంగా విచారణ జరుగుతుందని చెప్పారు. వివేకానందరెడ్డి మరణించిన సమయంలో దొరికిన లేఖను బహిర్గతం చేయాలని సీబీఐని కోరినట్టుగా చెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ తనకు తెలిసిన వాస్తవాలతో సీబీఐకి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. గూగుల్ టేక్అవుట్ అంటున్నారని.. అది గూగుల్ టేక్అవుటా? లేదా టీడీపీ టేక్‌అవుటా? అనేది భవిష్యత్తులో తేలుతుందని అన్నారు. చూడాలి మరి ఈరోజు విచారణలో ఏం జరగబోతుందో అని. ప్రస్తుతానికి అయితే ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/