Site icon Prime9

Visakhapatnam: ఏపీలో దారుణం.. ప్రేమోన్మాది చేతిలో తల్లి మృతి, కూతురికి గాయాలు

Young Man Attacks a women and her daughter With Knife In Visakhapatnam: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని కొమ్మాది స్వయంకృషి నగర్‌లో ప్రేమోన్మాది దాడిలో తల్లి మృతి చెందగా.. కూతురు తీవ్రంగా గాయపడింది. మధుర వాడ కృషినగర్ ప్రాంతానికి చెందిన నక్క లక్ష్మి, ఆమె కూతురు దివ్యపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

వివరాల ప్రకారం.. మధుర వాడ కృషినగర్ లో నక్క లక్ష్మి, ఆమె కూతురు దివ్య ఇంట్లో ఉండగా.. మధ్యాహ్నం 12.30 గంటలకు ఓ యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడికి దిగాడు. ఈ సమయంలో తల్లి అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. తల్లి లక్ష్మి(43)ని కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దాడిలో తీవ్ర గాయాలైన యువతి దీపికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీపిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

 

ఇదిలా ఉండగా, దీపిక డిగ్రీ పూర్తవ్వగా.. ఇంట్లోనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే గతంలో తనని ప్రేమించిన నవీన్ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

ఈ ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం బాధితురాలి ఆరోగ్యంపై ఆరా తీశారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దాడి చేసిన నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. యువతి తల్లి నక్క లక్ష్మి మృతిపై అనిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Exit mobile version
Skip to toolbar