Site icon Prime9

Konda Murali: మీకు మీసాలు లేవు.. ఆడో, మగో తెలియట్లేదు..మంత్రి కేటీఆర్ కు కొండా మురళి కౌంటర్

Konda Murali

Konda Murali

Konda Murali: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కౌంటర్ ఇచ్చారు. పెద్ద పెద్ద నాయకులమని చెప్పి మీసాలు తిప్పిన వాళ్లు కూడా పరకాలలో పోటీ చేయడానికి భయపడుతున్నారన్న కేటీఆర్ కామెంట్స్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన వాణ్ని.. మీసాలు పెంచి, మెలేయడం తమకు రాజుల కాలం నుంచి వచ్చిందని కొండా మురళి అన్నారు. మీసాలు లేకుండా మీరు ఆడో, మగో తెలియట్లేదని కేటీఆర్‌ను విమర్శించారు. మీసాలు ఉండి మెలేస్తే.. మగాడని తెలిసేదంటూ సెటైర్లు వేశారు.

మీ అయ్య కెసిఆర్ పిలిచి టిక్కెట్ ఇచ్చారు.. (Konda Murali)

పారిపోయ్యానని మాట్లాడుతున్నావు కేటీఆర్.మీ అయ్య కెసిఆర్ పిలిచి వరంగల్ తూర్పులో టికెట్ ఇచ్చారు.నేను పరకాలలో పోటీ చేస్తా అంటే?.. సారయ్య ను ఓడించడానికి తూర్పు టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డికి ఎదురు లేదని చెప్పావు కానీ.. గతంలో ఎన్నికలప్పడు మూడు రోజులు యశోదలో ఎందుకు జాయిన్ అయ్యాడు? అంటూ మురళి ప్రశ్నించారు.పరకాల లో ధర్మారెడ్డికి ఎదురు లేదని చెప్పావు. కానీ తూర్పులో నరేందర్ కు ఎదురులేదని ఎందుకు చెప్పలేకపోయావు కేటీఆర్?కొండా మురళి రౌడీ,గుండానే అయితే ఎమ్మెల్సీ ని ఎలా చేశారు? అని అడిగారు.

అక్షరం ముక్కరాని ఎర్రబెల్లిని మంత్రి చేశారు..

తరాజు కింద అయస్కాంతం పెట్టి బియ్యం జోకే ఎర్రబెల్లిని మంత్రి చేశారు. అక్షరం ముక్కరాని ఎర్రబెల్లిని మంత్రి చేశారు. 10 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా చేసి,అనుభవం ఉన్న కడియం ను పక్కకు పెట్టారు. దయాకర్ రావు పార్టీలోకి వస్తే మేము వెళ్లిపోతామని ముందే చెప్పాము. చల్లా ధర్మారెడ్డి నలుగురు గన్ మెన్ లు లేకుండా బయటికి వస్తాడా.? నేను తూర్పులో ఉంటా, పరకాలలో ఉంటా.నా పేరు పలికే దైర్యం కేసిఆర్ కుటుంబానికి లేదు.నా మీసాల గురించి కేటీఆర్ మాట్లాడి వెళ్ళిండు.పేదలకు సాయం చేసేటోన్ని, నన్ను రౌడీ అనడం సిగ్గుచేటు.అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళ నుండి ప్రతీ రూపాయి వసూల్ చేసి పేదలకు పంచుతా.ఛత్తీస్గఢ్, కర్ణాటక వలెనే ఇక్కడా కాంగ్రెస్ గెలుస్తుంది.నేను కాళ్ళు పట్టుకుంటే 100 సీట్లు నాకు ఇస్తారు.నేను ఆత్మాభిమానం చంపుకొని బ్రతికేవాన్ని కాదని కొండా మురళి స్పష్టం చేసారు.

 

Exit mobile version