Pithapuram Sticker War: జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారనే వార్తలు వచ్చినప్పటి నుంచి పిఠాపురం హాట్ టాపిక్ గా మారింది .ఎన్నికల ప్రచారం సమయంలోను ఎన్నికల అనంతరం కూడా పిఠాపురం వార్తల్లోకి ఎక్కుతూనే వుంది .ఇప్పటికే బెట్టింగ్ లు జోరందుకున్నాయి .దీనికి తోడు తాజాగా స్టిక్కర్లు వ్యవహారం తో పిఠాపురం మరో సారి వార్తల్లోకి వస్తోంది.
స్టిక్కరింగ్ షాపులకు క్యూ..(Pithapuram Sticker War)
స్థానికంగా కొంత మంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాయించుకుంటున్నారు. దింతో వైసీపీ అభిమానులు కూడా ఈ తరహా స్టిక్కర్లు తమ వాహనాలకు తగిలించుకుంటున్నారు .ఏకంగా వైసీపీ వాళ్ళు ‘డిప్యూటీ సీఎం వంగా గీత’ అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీక్ స్థాయికి చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది. ఎవరి నమ్మకంతో వాళ్లు స్టిక్కర్లు వేసుకొని హడావిడి చేస్తున్నారు. దీనికోసం స్కిక్కరింగ్ షాపులకు క్యూ కడుుతన్నారు. రవాణా శాఖ వాళ్ళు కూడా దీనిని పట్టించుకున్న పాపాన పోవడంలేదు .చూడాలి మరి కౌంటింగ్ నాటికి ఇది ఏ రూపం తీసుకుంటుందో చూడాలి..