Site icon Prime9

Janasena chief Pawan Kalyan: ఉపాధ్యాయులపై వైసీపీ సర్కార్ కక్షసాధింపు ధోరణి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

pavan kalyan

pavan kalyan

Janasena chief Pawan Kalyan: గురుపూజోత్సవం సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.జన్మనిచ్చిన అమ్మానాన్నల తరవాత మనకు అంతటి ఆప్యాయత, వాత్సల్యం లభించేది గురు దేవుళ్ళ దగ్గరే నని పవన్ అన్నారు. వీసమెత్తు కూడా ప్రతిఫలం ఆపేక్షించకుండా విజ్ఞానాన్ని పంచి… తమ శిష్యుల విజయాలను తమవిగా భావిస్తారు. పవిత్రమైన బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. తరగతి గది నుంచే ప్రపంచాన్ని పరిచయం చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు- శిష్యులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్ది, మన దేశ పురోగతిలో తమ వంతు పాత్రను మరింత సమర్థంగా పోషించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

టీచర్ల పట్ల ఏపీ సర్కార్ వైఖరి దారుణం..(Janasena chief Pawan Kalyan)

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారి పట్ల ఆంధ్రప్రదేశ్ పాలకులు, ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరి తరచూ విమర్శల పాలవుతోంది. ఉపాధ్యాయ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందనే మాట వినిపిస్తూనే ఉంది. ప్రభుత్వ చర్యలు సైతం అందుకు అనుగుణంగానే ఉంటున్నాయి. బోధనేతర విధులతో వారిని ఇబ్బందుల పాల్టేస్తోంది. నాడు-నేడు పనుల్లో పాలక పక్షం చేస్తున్న తప్పులకు ప్రధానోపాధ్యాయులను బలి చేస్తున్నారు. సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. పదోన్నతులు పొందిన, బదిలీ అయిన సుమారు 30వేల మంది ఉపాధ్యాయులకు కొద్ది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఉపాధ్యాయ దినోత్సవం చేసుకొనే ఈ సమయంలో ఏ ఉపాధ్యాయుడికీ ఇంకా జీతం చెల్లించలేదు అంటే ఈ ప్రభుత్వానికి గురు దేవుళ్లపై ఏ విధమైన ధోరణిని అవలంభిస్తోందో అర్థమవుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం కచ్చితంగా బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవమర్యాదలను కాపాడుతుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

Exit mobile version