Site icon Prime9

Nagababu Comments: ఎర్రకండువాను చూసి వణికిపోతున్న వైసీపీ నేతలు.. జనసేన నేత నాగబాబు

Nagababu

Nagababu

Nagababu Comments: పిఠాపురంలో జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకండువా అనేది జనసేన జెండా కాదని ఆయన స్పష్టం చేశారు. మంగళ వారం పిఠాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో నాగబాబు మాట్లాడారు . పవన్ వేసుకున్నారు కాబట్టే దానికి అంత పాపులారిటీ వచ్చిందన్నారు. ఈ ఎర్రకండువాని కాశీతువాలంటారని.. అది తమ చిన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నామన్నారు. వైసీపీ వాళ్లు ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే.. సామాన్య మానవుడు చెమట తుడుచుకునేందుకు ఉపయోగించే టవల్‌ను కూడా తీసేయమన్నారన్నారు.

వంగా గీత అభ్యంతరం.. (Nagababu Comments)

జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురంలో ఒక పోలింగ్ బూత్ లో ఒక ఓటర్ ఎర్ర కండువా వేసుకుని వస్తే ,వైసిపి అభ్యర్థి వంగా గీత అడ్డుపడింది .ఈ నేపథ్యం లోనే వీళ్ళు వేసుకున్న తువాలు జనసేన జెండా కాదని నాగబాబు అన్నారు .ఎర్ర రంగు తువాలు కనిపిస్తేనే వైసిపి నేతలు వణికి పోతున్నారని నాగబాబు అన్నారు . జనసేన పార్టీ ఎన్నికల సింబల్ వున్న కండువా వేసుకొని వస్తే తప్పనిసరిగా మీరు అడగొచ్చు.. కానీ ఎర్ర కండువా వేసుకొస్తే ఎలా అడుగుతారు అని ప్రశ్నించారు . వైసీపీ వాళ్లు ఎన్నికల్లో వారి జెండాలు వేసుకుని తిరగవచ్చు మా కుర్రోళ్ళు అందరూ కూడా ఎర్ర కoడువాలు వేసుకుని తిరిగారు..దాన్ని తీసేయండి అంటే ఎలా కుదురుతుందని అన్నారు .

వంగ గీత వ్యాఖ్యలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగబాబు | Nagababu Counter To Vangageeth | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar