Site icon Prime9

Chandrababu Naidu : వైసీపీ నేతలు ఫ్రస్టేషన్ లో ఉన్నారు.. చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu

Chandrababu Naidu

Chandrababu Naidu : ఏపీలో వైసీపీ నేతలు ఫ్రస్టేషన్ లో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కందుకూరులో జరిగిన ఘటన చాల దురదృష్టకరమని అన్నారు. దీనిపై వైసీపీ నేతల విమర్శలు వారి అహంకారానికి, అజ్జానానికి నిదర్శనమన్నారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సభలకు చాలాచోట్ల ఉత్సాహంగా రావడం , దగ్గరగా చూడాలనుకోవడం జరగుతోందన్నారు. ఒక ఐస్ క్రీమ్ బండిని తోయడం, పక్కనే మోటార్ బైకులమీద ఒకరిపై ఒకరు పడిపోవడం జరిగింది. నేను చూసిన తరువాత వెంటనే చెబుతున్నాను. తొక్కిసలాట జరుగుతుందని చెప్పాను. అయితే ఎమోషన్ లో ఈ సంఘటన జరిగింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. ఎనిమిది మంది చనిపోయారు. నలుగురికి గాయాలయ్యాయి. విధి వక్రించినపుడు, దేముడు చిన్నచూపు చూసినపుడు ఇటువంటి ఘటనలు జరుగుతాయి. వీరి పిల్లలను చదివిస్తాము. కుటుంబ సభ్యులను ఆదుకుంటాము. వీరు రాష్ట్రం కోసం త్యాగం చేసారు. వీరు రాష్ట్రం కోసం సమిధులుగా మారారు. వీరి త్యాగాలు వృధా కాకూడదు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిని వారికి లక్షరూపాయలు చొప్పున ఆర్దిక సాయం చేస్తున్నామన్నారు. తమ పార్టీ నేతలు మరో రూ.24 లక్షలవరకూ ఆర్దిక సాయం ప్రకటించారని అన్నారు,

ఈ సంఘటనకు తాను ఎవరినీ బ్లేమ్ చేయనని అయితే సెక్యూరిటీ చూడవలసిన అవసరం పోలీసులకు ఉందన్నారు. తనకు ఇరుకురోడ్లలో మీటింగ్ పెట్టవలసిన అవసరం లేదన్నారు. తాను రాష్ట్రంలో ప్రతీ ప్రాంతాన్ని చాలా సార్లు సందర్శించానన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందని ప్రజలు గుర్తించారని అందుకే తమ సభలకు హాజరై సంఘీభావం తెలుపుతున్నారని చంద్రబాబు అన్నారు. అయితే సభలు ప్రణాళికాబద్దంగా, క్రమశిక్షణతో నిర్వహించుకోవాలని అన్నారు.

Exit mobile version