Yadadri District: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్లిన యాదగిరిగుట్టకు చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాద్గిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్యనిన్న రాత్రి కూరగాయలు తీసుకొని తిరిగి ఇంటికొస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టడంతో సౌమ్య స్పాట్లోనే చనిపోయింది.
విలపిస్తున్న తల్లిదండ్రులు..(Yadadri District)
సౌమ్య మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు..భోరున విలపిస్తున్నారు. సౌమ్య తన ఇరవై ఐదవ పుట్టినరోజును మే 11న జరుపుకుంది. ఆమె మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది.సౌమ్య తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి ఆమె మృతదేహాన్ని తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థించారు.