Janasena chief Pawan Kalyan: పొత్తులపై తాము ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని ప్రజలకే చెబుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ మేము ఎన్ని చోట్ల పోటీ చేస్తాం.. ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది మీకు అనవసరమని వైసీపీ నేతలకు పరోక్షంగా సెటైర్లు వేసారు. జీ-20లో బీజేపీ నేతలు బిజీగా ఉన్నందున. నేనే పొత్తు గురించి ప్రకటించేశాను.టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక ఈ కూటమిపై ప్రజలకు భరోసా వచ్చిందని అన్నారు.
జీతాలు, పెన్షన్లు ఎప్పుడో తెలియని పరిస్థితి..(Janasena chief Pawan Kalyan)
టీడీపీతో సమన్వయం కోసం ఐదుగురితో జనసేన కమిటీ ఏర్పాటు చేసామని పవన్ కళ్యాణ్ తెలిపారు.వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది నా లక్ష్యం. ఢిల్లీలో బీజేపీ నేతలతో కూడా ఇదే విషయం చెప్పాను.మోదీ జీ-20 ప్రోగ్రామ్‌లో బిజీగా ఉన్నప్పుడు.. చంద్రబాబును అరెస్ట్ చేశారు.చంద్రబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడం బాధాకరం.నేను నా ప్రోగ్రామ్స్ కోసం వెళ్తుంటే.. నన్ను ఆపేశారు.2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలని నా ఆకాంక్ష.ఎన్డీయేతో పొత్తులో ఉన్నాం..ఎన్డీయే భేటీకి హాజరయ్యాం.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికామని పవన్ గుర్తు చేసారు. ఏపీలో జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని నడిపే అధికారులకు కూడా 20వ తేదీ వరకు జీతాలు రావట్లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు సరిగా రావడం లేదు. ఐఏఎస్‌లకూ సకాలంలో జీతాలివ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఐఏఎస్‌ల జీతాలు మళ్లించారు.. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగ ఉల్లంఘన వైసీపీకి సహజగుణంగా మారిందని పవన్ ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందన్నారు. వైసీపీ అరాచకాలకు చరమాంకం పలకాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు లేవనెత్తినా ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని అన్నారు.
సీబీఐ కేసుల వాయిదాకే ఢిల్లీ..
జనవాణిలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. కొల్లేరు నీటి సమస్య చాలా బాధ కలిగించిందన్నారు. కైకలూరు, ఉండవల్లి, ముదినేపల్లిలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. కొల్లేరు సరస్సులో 17 వేల టన్నుల వ్యర్థాలు చేరుతున్నాయని ,ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంటూరు పరిస్థితి మారుతోందన్నారు. తెలంగాణకు ఇచ్చిన వరాలు.. ఏపీకి ఎందుకు ఇవ్వలేదని ఢిల్లీకి వెళ్లి అడగాలని వైసీపీ నేతలకు సూచించారు. ఢిల్లీకి వెళ్లి క్యాషూ బోర్డు, కోకనట్ బోర్డు గురించి అడగండి. 30 మంది ఎంపీలు ఉన్నారు.. అక్కడికి వెళ్లి కాఫీలు, టీలు తాగడం కాదు. సీబీఐ కేసులు వాయిదా వేయించుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారని పవన్ వైసీపీ నేతలపై సెటైర్లు వేసారు.