Pawan Kalyan: కోనసీమలో కొబ్బరి బొండం లో ఎంత తీపిగా ఉంటుందో రాజోలు నా జీవితంలో అంతటిది .రాష్ట్రము అంతా ఓడిపోయినా రాజోలు లో గెలిచి ఒక చిన్న వెలుగు నింపిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ..ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ రాజోలు లో పాల్గొని ప్రసంగించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చీకటిలో వెలుగు లాగా రాజోలు జనసేనకు విజయం అందించింది .నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని .జగన్ లాగ తండ్రి రాజకీయాలతో పైకి రాలేదు .మీరు ఇచ్చిన బలమే నన్ను ఇలా నడిపిస్తుందని పవన్ అన్నారు .
జగన్ ప్రభుత్వం వెళ్లి పోతుంది..(Pawan Kalyan)
జగన్ ప్రభుత్వం వెళ్లి పోతుంది .ఎక్కడ కు వెళ్లినా ఇదే చెబుతున్నారు .మీరు చేయాల్సింది కూటమికి ఓటు వేయడమే అని పవన్ అన్నారు .గోదావరి పక్కనే పారుతున్న తాగటానికి మంచి నీరు లేదు .కోనసీమను చూపించే తెలంగాణ నాయకులూ ప్రత్యేక రాష్ట్ర వాదన తెచ్చారని ,కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉందని పవన్ అన్నారు .క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రాంతం ఇది .ఐదేళ్లు వైసిపి చేసింది ఏమి లేదు .వ్యవసాయం మీద దృష్టి పెట్టలేదు అని చెప్పారు.మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తాగు ,సాగు నీటి సమస్య తీరుస్తాను అని పవన్ హామీ ఇచ్చారు .రైతాంగం కోసం ఎంతైనా చేస్తాను .కానీ నాకు సమస్యను పరిశీలించే అవకాశం ఇవ్వండి .నేను వస్తే ఫొటోలు కోసం ఎగపడవద్దని విజ్ఞప్తి చేసారు .జగన్ వచ్చిన తర్వాత ,నీటి తీరువా సంఘాలు మూలన పడ్డాయి .20 వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు .ఐదెకరాల్లో రాపాక ఇల్లు కట్టుకున్నారు కానీ రైతుల కన్నీరు తుడిచే పని చేయలేక పోయారు .రైతులే కోన సీమకు వెన్నుముక .డ్రైన్ లన్ని పూడిపోయాయి ,పంటకాల్వలు కలుషితమయ్యాయి.కూటమి ప్రభుత్వం వస్తే అన్నిటిని బాగుచేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు . కోటిపల్లి- నర్సాపురం రైల్వే లైనును పూర్తి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. నేను పిఠాపురంలోనే ఉంటాను. నన్ను మీరు ఎప్పుడైనా కలవచ్చని పవన్ చెప్పారు.