Janasena chief Pawan Kalyan: రెండు రోజుల్లో తెలంగాణలో పోటీపై నిర్ణయం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.

  • Written By:
  • Updated On - October 18, 2023 / 01:08 PM IST

Janasena chief Pawan Kalyan: తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.

తెలంగాణాలో జరగనున్న శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై పోటీ చేయదలచుకున్న అభ్యర్థుల అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్నందున సానుకూల నిర్ణయం తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్‌ని కోరారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్ధం చేసుకోగలని పవన్ కళ్యాణ్ అన్నారు. తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు. సరైన నిర్ణయం తీసుకోడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని తెలిపారు.

జనసేన పిఎసి సభ్యురాలుగా పడాల అరుణ..(Janasena chief Pawan Kalyan)

జనసేన పిఎసి సభ్యురాలుగా పడాల అరుణ ను పార్టీ అధిష్టానం నియమించింది. ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులుగా పంచకర్ల రమేష్ బాబు నియమితులయ్యారు. క్రియాశీలక సభ్యుల శిక్షణ విభాగం చైర్మన్ గా ఈదర హరిబాబు, ప్రోటోకాల్ విభాగం చైర్మన్ గా మల్లినీడి తిరుమలరావు, ఉంగుటూరు అసెంబ్లీ ఇన్చార్జిగా పత్సమట్ల ధర్మరాజు, ఉండి అసెంబ్లీ ఇంచార్జ్ జుత్తిగ నాగరాజు నియమితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శులుగా ఆరుగురిని ఎంపిక చేశారు. వీరిలో ఆమంచి శ్రీనివాసరావు, పిసిని చంద్రశేఖర్, రత్నం అయ్యప్ప, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, చాగంటి మురళీకృష్ణ, మండలి రాజేష్ ఉన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నలుగురిని నియమించారు. వీరిలో చిత్తలూరు సుందరరామిరెడ్డి, ఎడ్లపల్లి రామ్ సుధీర్, పాతూరు నారాయణస్వామి మహేష్, మేడిశెట్టి సూర్య కిరణ్ లను జనసేన పార్టీ అధిష్టానం ఒక ప్రకటనలో తెలియజేసింది.