Sajjala Ramakrishna Reddy: మూడు హామీలు తప్ప తమ మేనిఫెస్టోలోని అన్ని విషయాలు అమలు జరిపామని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా, సంపూర్ణ మద్య నిషేధం, సిపిఎస్ రద్దు… ఈ మూడు హామీలు తప్ప 99 శాతం హామీలు అమలుచేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో సఖ్యతగా ఉండాలే తప్ప గొడవ పెట్టుకోలేమన్నారు. అయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నామన్నారు.
సంపూర్ణ మద్యపానం జగన్మోహన్ రెడ్డిగారి డ్రీమ్. దానిని అమలు చేయాలనే తీసుకున్నాము. కానీ దానిలో అనేక సమస్యలున్నాయి. కనుక మద్యం నియంత్రణకు చర్యలు తీసుకున్నామన్నారు. సిపిఎస్ రద్దుని మేము అమలుచేయలేకపోయిన మాట వాస్తవమే. దానిని అమలుచేస్తే మరో పదేళ్ళ తర్వాత ప్రభుత్వంపై చాలా భారం పడుతుందని గ్రహించామన్నారు. మొత్తంమీద కీలకమైన అంశాలపై సజ్జల చేతులెత్తేసారని చెప్వవచ్చు.