Janasena chief Pawan Kalyan:మేము ఓడితే నాకు కానీ చంద్ర బాబుకు కానీ ఏమి కాదు .కాని రైతులు,కార్మికులు ,విద్యార్థులు దెబ్బతింటారు .ఇది చూస్తూ నేను ఉరుకోలేను .అందుకే కూటమి కట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ-జనసేన ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమర్ల లో జ్యూట్ మిల్లు ను తెరిపిస్తామని చెప్పారు..రామతీర్థం లో రాముల వారి విగ్రహం పగల కొడితే ఇప్పటి వరకు చర్య తీసుకోలేదని మండిపడ్డారు.
భోగాపురం ఎయిర్ పోర్టును ఆనాడు జిఎంఆర్ కు చంద్ర బాబు అప్పగిస్తే నానా యాగీ చేసిన జగన్ ,అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జిఎంఆర్ కు కట్టబెట్టారని పవన్ విమర్శించారు. నవనందులు అనే అసమర్థ వైసీపీ నేతలను చాణక్యుడు మాదిరి అంతం చేయాలని పవన్ అన్నారు. తారక రామ తీర్థ ప్రాజెక్టు పూర్తి చేస్తామని దీనితో 17 వందల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. పునరావాస ప్యాకేజి అమలు చేసే భాద్యత తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు .అదే విధంగా కిడ్నీ సమస్యలు వున్నాయి.దీనిని అరికట్టడానికి ప్రతి మండలంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో తగినన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. రాముల వారి తల పగిలితే దెబ్బ కాదా? బాబాయ్ గొడ్డలి వేటు దెబ్బ కాదు ? అమర్నాథ్ అనే పిల్లోడిని తగల పెడితే అది గాయం కాదు ? కానీ తలకు గులక రాయి తగిలితే మాత్రం ఇంత కట్టుకట్టుకుని తిరుగుతున్నారని పవన్ ఎద్దేవా చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా అంటూ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉంటే భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయ్యేదని తెలిపారు.