Site icon Prime9

Ambati Rambabu Comments: ఏపీలో 175 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నాము.. అంబటి రాంబాబు

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu Comments: ఏపీలో 175 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఇంట్లో నేడు వైసీపీ నాయకులు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్ లు భేటీ అయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

లోకేష్ అడుగుపెట్టాక టీడీపీ నాశనం..(Ambati Rambabu Comments)

ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర చేస్తున్నామని అంబటి తెలిపారు. మరలా జగనే ఎందుకు కావాలనే కార్యక్రమం చేపడుతున్నామని రాంబాబు చెప్పారు. చంద్రబాబు, లోకేష్ వేలకోట్లు దోచుకున్నారని, వారిపై తమకు కక్షసాధింపు లేదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అటువంటి ఉద్దేశ్యం ఉన్నట్లయితే జగన్ సీఎం అయిన ఏడాదిలోనే కక్ష సాధించేవారని అన్నారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి సీఐడీ అరెస్ట్ చేసిందని అన్నారు. ప్రజా ధనాన్ని దోచుకున్నవారిని,అవినీతి చేసిన వారని జైల్లో పెడితే సింపతీ రాదు. ఏసీబీ కోర్టునుంచి సుప్రీంకోర్టు వరకూ ఎక్కడా రిలీఫ్ రాలేదు. ఆధారాలు పక్కాగా ఉన్నపుడు బెయిల్ ఇవ్వరు. మూడంచెల న్యాయస్దానాల్లో పిటిషన్లను డిస్మిస్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు రాజకీయ జీవితం ఖతం అయినట్లేనని అంబటి అన్నారు. పచ్చగా ఉండే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ అడుగుపెట్టాక నాశనం అయిపోయిందన్నారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. రాజశేఖర్ రెడ్డే తనను ఏం చేయలేకపోయారని నువ్వు ఏం పీకుతావని జగన్ ను చంద్రబాబు అన్నారని దీనితో పీకి జైల్లో పెట్టారని అన్నారు. అంతకుమందు మండలిలో అప్పిరెడ్డిని విప్ గా నియమించినందున ఆయనను వైసీపీ నాయకులు అభినందించారు.

Exit mobile version