Site icon Prime9

Nagababu Vs Vanga Geetha: జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం.. నాగబాబు వర్సెస్ వంగా గీత

Nagababu Vs Vanga Geetha

Nagababu Vs Vanga Geetha

Nagababu Vs Vanga Geetha: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పలువురి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలకు.. కూటమికి చెందిన పలువురు నేతలకు పచ్చ గడ్డి వేస్తే.. భగ్గుమన్న చందంగా మాటలు తూటాల్లో పేలుతున్నాయి. తాజాగా జనసేన నేత నాగబాబు వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటికి వైసీపీ నేతవంగా గీత కౌంటర్ ఇచ్చారు.

కడపనుంచి గూండాలు..(Nagababu Vs Vanga Geetha)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు.. కడప నుంచి గుండాలు, రౌడీలను తీసుకొస్తున్నారని నాగబాబు ఆరోపించారు.ఈ కుట్ర వెనక వైసీపీ నేతలు మిథున్ రెడ్డి ,దాడిశెట్టి రాజా రెడ్డి ఉన్నారని ఆరోపించారు. వారిరువురూ కలిసి పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా.. ఎంతమందిని తీసుకొచ్చిన పవన్ ను ఓడించడం అసాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంతమందిని తీసుకువచ్చినా.. తాము బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎంతమంది వస్తారో రండి.. చూసుకుందాం.. అని ఆయన వైసీపీ నేతలను హెచ్చరించారు.

పిఠాపురంలో బయటవారు ఎవరు?

నాగబాబు వ్యాఖ్యలపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత ఘాటుగా స్పందించారు. నూటికి నూరు శాతం నాగబాబు వ్యాఖ్యలు కల్పితమని ,తనను కొడుతున్నారు.. తిడుతున్నారని చెప్పుకుని జాలి పొందాలనుకోవడం తప్పు అని గీత అన్నారు. వారిని ఏదో చేసేస్తున్నారనే వ్యాఖ్యలు జనసేన నుండి వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ కూడా బ్లేడలతో దాడి చేస్తున్నారని రౌడీతత్వాన్ని పిఠాపురం నియోజకవర్గానికి అంటగట్టారు. ఇప్పుడు కడప నుంచి మనుషులు వచ్చేశారని ఆరోపణలు చేస్తున్నారని గీత మండి పడ్డారు . ఏడాది కాలం నుంచి మిథున్‌ రెడ్డి మా పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌. నియోజకవర్గంలో పార్టీ సమస్యలు పరిష్కరించడానికి ఆయన వచ్చి వెళ్తారు. ప్రస్తుతం పిఠాపురంలో బయట వాళ్లు ఎవరున్నారని లెక్కలు చూస్తే అసలు విషయం తెలుస్తుందని నాగబాబు వ్యాఖ్యలను తప్పు పట్టారు వంగా గీత .

Exit mobile version