Vijayasai Reddy satires: ఇంతకాలం బీజేపీలో ఉన్నా పురంధేశ్వరిని పెద్దగా పట్టించుకోని వైఎస్ఆర్‌సిపి నేతలు ఆమె అధ్యక్షురాలైన తరువాత వరుసగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇంతకాలం ఆమె పట్ల కాస్త మర్యాదగా మాట్లాడిన ఫ్యాను పార్టీ నేతలు ఇప్పుడు డోసు పెంచారు. ఇటీవలి కాలంలో ఏపీలోని ముఖ్య పట్టణాలకి వెళుతూ మీడియా సమావేశాల్లో పురంధేశ్వరి వైఎస్ఆర్‌సిపిపై విరుచుకు పడుతున్నారు. అంతే ఘాటుగా వైఎస్ఆర్ మంత్రులు స్పందిస్తున్నారు.
మరిది కళ్ళలో ఆనందమే తమరి టార్గెట్.. ( Vijayasai Reddy satires)
ఇప్పుడు వైఎస్ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. అమ్మా, పురంధేశ్వరిగారు..బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదు! బాబుది స్క్రిప్ట్… వదినది డైలాగ్! అంటూ సెటైర్లు వేశారు. తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ. మరిది కళ్ళలో ఆనందమే తమరి టార్గెట్! అంటూ విమర్శించారు. మీ నాన్నగారు మహానటులు… మీరు కాదనుకున్నామని విజయసాయి అన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే! అంటూ విజయసాయి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.