Vijayasai Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి చంద్రబాబు హయాంలో కంటే 13.2 లక్షల కోట్లకు పెరిగిందని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రం దేశంలోనే పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 5వ స్థానంలో ఉందన్నారు. ఇవన్నీ పచ్చ కళ్లద్దాల వల్ల పురంధేశ్వరికి కనిపించడంలేదని మండిపడ్డారు.
నాలుక వాచిందేమో..(Vijayasai Reddy)
టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అని ఆయన ఎద్దేవా చేశారు. లోకేశ్‌కి నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు అని సూచించారు. ఛాలెంజ్ చేయడానికి కూడా ఒక స్థాయి ఉండాలని విమర్శించారు.