Drugs in Hyderabad:హైదరాబాద్ శివారు కూకట్ పల్లిలో విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ ఎస్ఓటీ, కూకట్ పల్లి పోలీసులు సంయుక్తంగా దాడిచేసి శేషాద్రినగర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారివద్ద నుంచి మూడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి స్వాధీనం..(Drugs in Hyderabad)
కూకట్ పల్లికి చెందిన నీలేష్ రెడ్డి, కట్టా రాజశేఖర్ రెడ్డి, బెంగళూరుకు చెందిన ప్రేమ్ సాయిలు కొంతకాలంగా ఈ డ్రగ్స్ దందా చేస్తున్నారు. వీరిలో నీలేష్, రాజశేఖర్ లను పోలీసులు పట్టుకున్నారు. బెంగుళూరుకు చెందిన సాయి పరారీలో ఉన్నాడు. ఇక జగద్గిరిగుట్టలో ఇద్దరు విద్యార్థుల వద్ద ఉన్న మూడు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.జగద్గిరిగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.