Nara Lokesh: నిజం గెలవాలి… చంద్రబాబుకి వేసిన సంకెళ్లు బద్దలు కావాలని టిడిపీపిలుపునిచ్చింది. చంద్రబాబు బయటికి రావాలంటే జగనాసురునికి కనువిప్పు కలగాలని, ఈ రాత్రి 7 గంటలకు కళ్ళకు గంతలు కట్టుకుని, చంద్రబాబుకి మద్దతుగా నిజం గెలవాలి అని గట్టిగా నినాదాలు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు నిచ్చారు. దీనికి సంబంధించి ఫోటోలు, సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.
ఇన్నాళ్లూ ప్రజల కళ్లకి గంతలు కట్టారు..( Nara Lokesh)
ఇప్పటికే టీడీపీ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం వంటి కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. వాటిలో భాగంగా ఇపుడు తాజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇలా ఉండగా టీడీపీ కార్యక్రమంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సైటైర్లు వేశారు. ఇన్నాళ్లూ ప్రజలకళ్ళకి గంతలు కట్టారు, ఇప్పుడు మీరే కట్టుకుంటున్నారు , విధి………విచిత్రమైనదంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.