TPCC Chief Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. పార్టీలో చేరికలపై సమాలోచనలు చేశారు. ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైన వేళ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్, జానా రెడ్డిని సంప్రదించకుండా చేరికలు జరగడం లేదని రేవంత్ రెడ్డి మీడియాకి చెప్పారు.
15 ఎంపీ సీట్లను గెలిచి..( TPCC Chief Revanth Reddy)
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అందరం కలిసే పని చేస్తామని కోమటి రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కనీసం 15 ఎంపీ స్థానాల్లోనైనా గెలిచి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 30 ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి రావడానికి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు పొంగులేటి నివాసానికి రేవంత్ వెళ్లనున్నారు. పొంగులేటి, జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు.