Site icon Prime9

Tirumala: తిరుమలలో ముగ్గురు దళారీల అరెస్ట్

Tirumala

Tirumala

Tirumala: తిరుమలలో దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు దళారులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. తిరుమలలో గదుల దళారులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. ముగ్గురు దళారులు నాగ బ్రహ్మచారి, కేఈ వెంకటేశ్వరరావుతో పాటు మరో వ్యక్తిని సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.

నెలరోజుల్లో 50 గదులు..(Tirumala)

ముగ్గురు దళారులు నెలరోజుల వ్యవధిలో 50కి పైగా రూంలను వివిధ ఆధార్ కార్డుల ద్వారా పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఆధార్ కార్డులను దళారులు మార్ఫింగ్ చేస్తున్నారా లేక వీరికి ఎవరైనా సహకరిస్తున్నారా అనేది విచారణలో తేలుతుందని తిరుమల టూటౌన్ సీఐ సత్యన్నారాయణ తెలిపారు. 50, 100 రూపాయల గదులను వెయ్యి రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దళారీ వ్యవస్థపై సమగ్ర దర్యాప్తు చేపడుతామన్నారు. యాత్రికుల వద్ద నుంచి ఆధార్ కార్డులను సేకరించి..ఆ కార్డుల ద్వారా అనేక రూంలు పొందినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు.

Exit mobile version