mega888 Chandrababu Naidu: తాము అధికారంలో ఉన్నపుడు పోలవరం

Chandrababu Naidu: వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఇబ్బందుల పాలు జేసింది.. చంద్రబాబు నాయుడు

తాము అధికారంలో ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం పూర్తయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 7 మండలాలను కలపడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగిందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును ఇబ్బందులు పాలుజేసిందని అన్నారు.

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 04:49 PM IST

Chandrababu Naidu: తాము అధికారంలో ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం పూర్తయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 7 మండలాలను కలపడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగిందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును ఇబ్బందులు పాలుజేసిందని అన్నారు.

రివర్స్ టెండరింగ్ అంటూ..(Chandrababu Naidu)

జగన్ హయాంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టును రివర్స్ చేసారని ఆరోపించారు. డ్యామేజీ కంట్రల్ చేయడానికి ఒక సంవత్సరం పడుతుందన్నారు. నేను 30 సార్లు పోలవరం వచ్చాను. ప్రాజెక్టు గురించి నాకు బాగా తెలుసు. అందుకే చెబుతున్నాను. చేతకాని వాళ్లు పరిపాలిస్తే ఇలానే ఉంటుందని అన్నారు. జగన్ పోలవరానికి చేసిన చేటును ఒక కేసు స్టడీగా తీసుకుని పరిశీలించాలని అన్నారు. జగన్ రాష్ట్రానికి శాపంగా మారాడు .రూ.550 కోట్ల తో కాపర్ డాం లు నిర్మించారు .చివరికి కాపర్ డాం కూడా కాపాడ లేక వదిలేసారు.చాల విషయాలు చెప్పాలి .స్టడీ చేసిన తర్వాత మళ్ళీ చెబుతాను .ఎంత టైం పడుతుందో ..ఎంత ఖర్చు అవుతుందో ..పునరావాస ప్యాకేజీ కూడా పెరిగింది .కేంద్రం తో ముడిపడి వుంది వాళ్ళు ఏమంటారో చూడాలి .మొత్తం మీద జగన్ పోలవరాన్ని నిర్లక్ష్యం చేసారని చంద్రబాబు పేర్కొన్నారు.