Site icon Prime9

Governor Tamilisai: గవర్నర్ తమిళిసై పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్

Governor Tamilisai

Governor Tamilisai

Governor Tamilisai: గవర్నర్ తమిళిసై పై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లులు ఆమోదించకపోవడంపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు చీఫ్ సెక్రటరీ. రిట్ పిటిషన్‌లో ప్రతివాదిగా తెలంగాణ గవర్నర్ తమిళి సై పేరును ప్రస్థావించారు. రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

గవర్నర్, సర్కార్ మధ్య కోల్డ్ వార్..(Governor Tamilisai)

తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్రపడాలి. అయితే బిల్లులను అధ్యయనం చేస్తున్నట్లుగా గవర్నర్ తమిళిసౌ సౌందర్ రాజన్ ప్రకటించారు. గత కొంతకాలంగా తెలంగాణ సర్కార్ కు, గవర్నర్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ ఇతర మంత్రులు రాకపోవడం, ఉభయసభల ప్రసంగానికి గవర్నర్ ను ఆహ్వానించకపోవడం వంటివి జరిగాయి. అదే సమయంలో గవర్నర్ జిల్లా పర్యటనలకు వెళ్లినపుడు అధికారులు, మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదు. దీనిపై గవర్నర్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసారు.

గత ఏడాది గవర్నర్ లేకుండానే బడ్జెట్..

రాష్ట్ర గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీ.ఇందుకు భిన్నంగా గతేడాది బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ ప్రసంగం లేకుండానే నిర్వహించారు.
గవర్నర్‌ ప్రసంగం లేకుండా సమావేశాలు నిర్వహించుకునే సాంకేతిక వెసులుబాటు ఉంది.దీని ద్వారానే ప్రభుత్వం గత ఏడాది గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ ని ప్రవేశపెట్టారు.
అయితే ఈ ఏడాది మాత్రం గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనితో ప్రభుత్వం, గవర్నర్ మధ్య రాజీ కుదరిందనే అనుకున్నారు. అయితే తాజా పరిణామాలు మాత్రం మరలా ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య ఘర్షణ పెరిగిందనే సూచిస్తున్నాయి.

తెలంగాణలో గవర్నర్ అంటే ప్రభుత్వానికి చిన్నచూపని తమిళి సై గతంలోనే ఆరోపించారు.గవర్నర్ కు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ పాటించరు. రాజ్యాంగపదవిలో ఉండి రాజకీయాలు మాట్లడను.మిగలిన రాష్ట్రాల గురించి నాకు తెలియదు కానీ తెలంగాణ సర్కార్ ప్రోటోకాల్ పాటించడం లేదో చెప్పాలి.ప్రోటోకాల్ పాటించకపోవడమంటే అహంకారం కాక మరేంటి. రిపబ్లిక్ డే అంశంపై నాకు సమాచారం లేదు.నా ప్రశ్నలకు సమాధానమివ్వాలి. అప్పుడు మాత్రమే రాజ్యాంగ వ్యవస్థపై మాట్లాడాలి.నేను 25 ఏళ్లుగా రాజకీయాల్లోఉన్నాను. నాకు ప్రోటో కాల్ తెలుసు. నేను ఇండిపెండెంట్ గా పని చేస్తున్నాను.నా పై ఎవరి ఒత్తిడి లేదు.గవర్నర్ వ్యవస్థ ఎలా హేళన చేస్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ ను అవమానించారు అంటూ తమిళసై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version