Chandrababu Naidu: ఏపీలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని.. ప్రజా జీవితం అంధకారంలోకి వెళ్లిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదివారం చంద్రబాబు నివాసంలో పవన్ , చంద్రబాబుల భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ జీవో నంబర్ 1 తీసుకొచ్చాక కుప్పంలో జరిగిన అరాచకాలపై సంఘీభావం తెలియజేసేందుకు పవన్ రావడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో బ్రిటిష్ పాలన..
బ్రిటిష్‌కాలం నాటి జీవో తీసుకొచ్చారు. దానికి చట్టబద్ధత ఉందో లేదో కూడా తెలియదు. నా నియోజకవర్గానికి వెళితే అడ్డుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని.. సొంత నియోజకవర్గానికి రానీయకుండా చేసేందుకు 2-3 వేల మంది పోలీసులను పెట్టి వెనక్కి పంపేందుకు యత్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో నంబర్ 1 కరెక్ట్ కాదు. కందుకూరు, గుంటూరు ఘటనలకు పోలీసు వైఫల్యం కారణం కాదని చెప్పే ధైర్యం వైకాపా నేతలకు ఉందా? శాంతి భద్రతలను కాపాడాల్సింది ఎవరు?వైకాపా ప్రభుత్వ అరాచకాలపై అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు వస్తే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఎంత భయపెట్టినా మా మనో నిబ్బరాన్ని దెబ్బతీయలేరని చంద్రబాబు (Chandrababu naidu) అన్నారు.
అవినీతి, నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ..
ప్రజాస్వామ్యంలో జరగకూడనివి జరుగుతున్నాయి. విశాఖలో ఆంక్షలు పేరుతో పవన్ కల్యాణ్‌ను హింసించారు. ఇప్పటంలో అక్కడి ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లినా అలాగే చేశారు. తెదేపా ఆఫీసుపై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి. వైకాపాకు మాత్రం నేరాలు, అవినీతి, వ్యవస్థలు నాశనం చేయడం అలవాటని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని.. ప్రజా జీవితం అంధకారంలోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి :
Kerala: కేరళలో బీడీలు చుట్టిన వ్యక్తి … అమెరికాలో జడ్జి అయ్యాడు..
China: చైనాలో ఘోర ప్రమాదం..17 మంది మృతి, 22 మందికి గాయాలు.. కారణం ఏంటంటే?
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/