Site icon Prime9

Khammam: ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయుడు బైరోజు వెంకటాచారి హత్య కేసును ఛేదించిన పోలీసులు

t vs t

t vs t

Khammam: ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద జరిగిన టీచర్ బైరోజు వెంకటాచారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 15 లక్షలు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో చంపించారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని హతుడు వెంకటాచారి స్నేహితుడు గిరిధర్ రెడ్డిగా నిర్థారించారు. మరో ముగ్గురితో కలిసి వెంకటాచారిని చంపేశారని ఖమ్మం రూరల్ ఎసిపి బస్వారెడ్డి మీడియాకి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్న గిరిధర్ రెడ్డి తన భార్యకి హతుడు వెంకటాచారికి అక్రమ సంబంధం ఉందని అనుమానం కలిగింది.

భార్యపై అనుమానంతో..(Khammam)

గతంలో సూర్యాపేట జిల్లా మోతెలోని ఒకే కాలనీలో వెంకటాచారి, గిరిధర్ రెడ్డి కుటుంబాలు నివసించాయి. ఆ సమయంలో భార్యపై గిరిధర్ రెడ్డికి అనుమానం కలిగింది. దీంతో కన్నకూతురికి గిరిధర్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించాడు,. గిరిధర్ రెడ్డి వేధింపులతో భార్య ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. గిరిధర్ రెడ్డి తీరుతో మోతెనుంచి కూసుమంచి మండలం నాయకన్ గూడానికి వెంకటాచారి నివాసాన్ని మార్చాడు. తన భార్య విడిచి వెళ్లడానికి తన కుటుంబం చిన్నా భిన్నం కావటానికి వెంకటాచారే కారణమని భావించిన గిరిధర్ రెడ్డి హత్యకి కుట్ర పన్నాడని ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు.

రెక్కీ నిర్వహించి..

గతంలోనే గిరిధర్ రెడ్డిపై మూడు హత్యకేసులు , ఓ వేధింపుల కేసు నమోదు అయ్యాయి. ఈనేపథ్యంలో కోర్టులో పలువురు నేరస్తులతో గిరిధర్ రెడ్డి పరిచయం పెంచుకున్నాడు.మొత్తం ముగ్గురితో కలిసి వెంకటాచారిని హత్యచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. హత్యకుగానూ ఒక్కొక్కరికి కోర్టు ఖర్చులు పోనూ ఐదులక్షలకు ఒప్పందం కుదరింది. దీనితో ఈనెల 17న హైదరాబాద్ వెళ్లి ఓయాప్ ద్వారా కారును నిందితులు అద్దెకు తీసుకున్నారు. పలుమార్లు వెంకటాచారిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు. 21, 22న హత్యచేసేందుకు ప్లానింగ్ చేసినా స్పాట్ కుదరకపోవడంతో 23వ తేదీకి వాయిదా వేసారు. ఆ రోజునాయకన్ గూడెం నుంచి బయలుదేరిన వెంకటాచారిని అనుసరిస్తూ మార్గమధ్యంలో వెంకటాచారి బైక్ ను నిందితులు కారుతో ఢీకొట్టారు.పడిపోయిన వెంకటాచారిని మరో బైక్ పై అనుసరించిన ఇద్దరు దుండగులు కత్తితో గాయపరిచారు. తీవ్ర గాయాలతో ఉన్న వెంకటాచారిపై మూకుమ్మడిగా కత్తులతో నరికి కిరాతకంగా హత్యచేసారు. వెంకటాచారి మరణించాడని నిర్థారించుకున్నాకే ఘటనా స్థలం నుంచి నిందితులు వెనుదిరిగారు.వెంకటాచారి హత్య కేసులో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు.నిందితుల నుంచి ఓరెడ్ కలర్ కారు, రెండు కత్తులు, బైక్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version